![]() |
![]() |

ఇప్పుడు బుల్లి తెర నటులు కూడా సినిమా నటులతో పాటు పేరు ప్రఖ్యాతులని సంపాదిస్తున్నారు.ప్రతి రోజు ప్రేక్షకుడి ఇంటి తలుపు తట్టడంతో వాళ్ళు ఆ విధమైన గుర్తింపుని పొందుతున్నారు.అలా సీరియల్స్ ద్వారా ప్రేక్షకుల్లో మంచి ఫాలోయింగ్ ని సంపాదించిన నటి శ్రీవాణి. ఇప్పుడు ఆమెకి సంబంధించిన ఒక విషయం వైరల్ గా మారింది.
శ్రీవాణి ఇటీవల బ్యాంకాక్ టూర్ కి వెళ్ళింది.ఈ క్రమంలో అక్కడి జూ పార్క్ కి వెళ్లి అందులో వున్న ఒక పులికి పాలు పట్టించింది.పట్టించడం అంటే అలా ఇలా కాదు ఏకంగా తన ఒళ్ళో కుర్చోబెట్టుకొని పాల డబ్బాతో పాలు పట్టించింది.పైగా పులి కూడా శ్రీవాణి నాకు అంతకు ముందే తెలుసన్నట్టుగా దర్జాగా పాలు తాగింది. ఆ పిక్ ని శ్రీవాణి సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వాటిని చూసిన అందరు రకరకాల రీతిలో స్పందిస్తున్నారు. కొంత మంది మాత్రం ఇలాంటి పనులు చెయ్యడం ఏంటని నెగిటివ్ గా కామెంట్స్ పెడుతున్నారు.
ఇక శ్రీవాణి ఇప్పుడు సీరియల్స్ లో పెద్దగా కనపడకపోతున్నా కూడా సోషల్ మీడియా ద్వారా మాత్రం ఫుల్ యాక్టీవ్ గా ఉంటుంది. యూట్యూబ్ లో రకరకాల ప్రోగ్రామ్స్ చేస్తు బాగానే సంపాదిస్తుంది.వాటికి చాలా మంది అభిమానులు ఉన్నారు. చంద్రముఖి,కలవారి కోడలు,మనసు మమత, కాంచన గంగ,మావి చిగురు లాంటి సీరియల్స్ ఆమెకి మంచి గుర్తింపుని తెచ్చాయి.
![]() |
![]() |