![]() |
![]() |

ఈ ఏడాది సంక్రాంతికి స్టార్ హీరోల సినిమాలతో పాటు విడుదలై బాక్సాఫీస్ దగ్గర సంచలనాలు సృష్టించిన చిత్రం 'హనుమాన్'. తేజ సజ్జ హీరోగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా జనవరి 12న విడుదలై.. వరల్డ్ వైడ్ గా ఏకంగా రూ.300 కోట్ల గ్రాస్ రాబట్టి, టాలీవుడ్ టాప్ గ్రాసర్స్ లో ఒకటిగా నిలిచింది. అంతలా థియేటర్లలో సత్తా చాటిన ఈ చిత్రం.. త్వరలో ఓటీటీ అలరించడానికి సిద్ధమవుతోంది.
జయాపజయాలతో సంబంధం లేకుండా మెజారిటీ సినిమాలు థియేటర్లలో విడుదలైన నాలుగు వారాలకే ఓటీటీలోకి అడుగుపెడుతున్నాయి. ఈ సంక్రాంతికి 'హనుమాన్'తో పాటు థియేటర్లలో విడుదలైన 'గుంటూరు కారం', 'సైంధవ్', 'నా సామి రంగ' సినిమాలు ఇప్పటికే ఓటీటీలోకి అడుగుపెట్టాయి. అయితే 'హనుమాన్' మాత్రం థియేటర్లలో విడుదలైన 50 రోజులకు ఓటీటీలోకి రాబోతుంది. ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ రైట్స్ ని జీ5 సొంతం చేసుకుంది. తెలుగుతో పాటు ఇతర భాషల్లో కూడా మార్చి 2 నుంచి జీ5 లో హనుమాన్ స్ట్రీమింగ్ కానుందని సమాచారం.
ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్ పై నిరంజన్ రెడ్డి నిర్మించిన ఈ సినిమాలో అమృత అయ్యర్, వరలక్ష్మి శరత్‌కుమార్, సముద్రఖని, వినయ్ రాయ్, వెన్నెల కిషోర్ తదితరులు నటించారు. గౌరహరి, అనుదీప్ దేవ్ సంగీతం అందించిన ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్ గా దాశరధి శివేంద్ర, ఎడిటర్ గా సాయి బాబు వ్యవహరించారు.
![]() |
![]() |