![]() |
![]() |

మలయాళం సినిమా ఇండస్ట్రీలో ఎన్నో వినూత్నమైన సినిమాలు చేస్తూ ఆకట్టుకుంటున్నాడు మమ్ముట్టి. కన్నూర్ స్క్వాడ్, భీష్మ పర్వం, క్రిస్టోఫర్, యాత్ర సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన మమ్ముట్టి రీసెంట్ గా ఓ వివాదాస్పద కథతో ముందుకొచ్చాడు.
కాథల్- ది కోర్ సినిమాతో అందరికి చర్చనీయాంశంగా మారిన నటుడు 'మమ్ముట్టి'. ఈ సినిమా కథ స్వలింగ సంపర్కాన్ని ప్రోత్సహించేలా ఉన్నాయని కువైట్, ఖతర్ దేశాలు బ్యాన్ చేశాయి. హీరోయిన్ గా జ్యోతిక ఈ సినిమాలో నటించడం మరింత ఆసక్తికరంగా మారింది. అయితే ఈ సినిమా ఓటీటీ లో విడుదల చేయడంతో భారీగా వ్యూయర్ షిప్ వచ్చిందని తెలుస్తోంది. ఇప్పుడు అదే బాటలో మరో సరికొత్త కథతో వచ్చాడు మమ్ముట్టి.
ఆయన ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ' భ్రమయుగం'. ఈ చిత్రం హరర్ థ్రిల్లర్ గా రానుంది. దీనిని దర్శకుడు రాహుల్ సదాశివన్ తీర్చిదిద్దాడు. తాజాగా ఈ సినిమా ట్రైలర్ ని రిలీజ్ చేసిన మేకర్స్ పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకున్నారు. అయితే ఇది ఫిబ్రవరి 15 నుండి మలయాళంతో పాటు తెలుగులోను థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ మధ్య కాలంలో ఓటీటీలలో తన కథలతో ఆకట్టున్న మమ్ముట్టి మన తెలుగు ప్రేక్షకులను మెప్పిస్తాడో లేదో చూడాలి మరి.
![]() |
![]() |