![]() |
![]() |
రవితేజ కొత్త సినిమా ‘ఈగల్’ ఇటీవల విడుదలైన విషయం తెలిసిందే. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాకి డివైడెడ్ టాక్ వచ్చింది. సినిమా గురించి ఒక్కొక్కరు ఒక్కోలా మాట్లాడుతున్నారు. సినిమాలో యాక్షన్ పార్ట్ ఎక్కువైందని కొందరంటే, లవ్‌ట్రాక్ గురించి పట్టించుకోలేదని కొందరంటున్నారు. ఇలాంటి కామెంట్స్ వస్తున్న నేపథ్యంలో దర్శకుడు హరీష్ శంకర్ వాటిపై కౌంటర్ ఇచ్చాడు.
ఇటీవల జరిగిన ఈ సినిమా సక్సెస్ మీట్‌లో హరీష్ శంకర్ మాట్లాడుతూ చాలా మంది ఈ సినిమాలోని లవ్ ట్రాక్ గురించి మాట్లాడుతున్నారని, అసలు ఇది ఏ జోనర్ సినిమా అనేది ఆలోచించకుండా లవ్‌ట్రాక్ గురించి ఎలా మాట్లాడతారని అసహనం వ్యక్తం చేశాడు. ఇది ‘ప్రేమపావురాలు’ కాదు లవ్‌ట్రాక్‌ని ఇంకా బాగా చూపించడానికి అంటూ కామెంట్స్ చేస్తున్న వారికి కౌంటర్ ఇచ్చాడు. గడ్డం పెంచుకొని రఫ్‌గా ఉన్న హీరో గన్‌తో అందర్నీ కాల్చుకుంటూ వెళుతుంటే ఇక లవ్ ట్రాక్ గురించి మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్? అని ప్రశ్నిస్తున్నాడు. డైరెక్టర్ కార్తీక్ గురించి తనకు బాగా తెలుసని, అతని టాలెంట్‌పై ఉన్న నమ్మకంతోనే ఈ సినిమా గురించి తాను మాట్లాడుతున్నానని స్పష్టం చేశాడు. నిజానికి ఎంతో కష్టపడి ఈ సినిమా చేశాడని, తప్పకుండా ఈ సినిమా అందరికీ రీచ్ అవుతుందన్న నమ్మకం తనకు ఉందని అంటున్నాడు హరీష్ శంకర్.
![]() |
![]() |