![]() |
![]() |

ఈ భూమ్మీద పుట్టిన ప్రతి మనిషికి తన పుట్టిన రోజుకి సంబంధించి ఒక డేట్ ఉంటుంది.అలాగే తెలుగు సినిమాకి కూడా ఒక డేట్ ఉంది. ప్రతి సంవత్సరం మనిషి తన పుట్టిన రోజుని ఎలా అయితే జరుపుకుంటాడో తెలుగు సినిమా కూడా ప్రతి సంవత్సరం తన పుట్టిన రోజుని జరుపుకుంటుంది. ఎంతో మందికి కీర్తిని, డబ్బుని, అధికారాన్ని, ఉపాధిని కల్పించిన తెలుగు సినిమా తాజాగా తన పుట్టినరోజుని జరుపుకుంది.
తెలుగులో మొట్టమొదట రిలీజైన మూవీ భక్త ప్రహ్లాద. 1932 ఫిబ్రవరి 6 న ఆ మూవీ రిలీజ్ అయ్యింది.అంటే తెలుగు సినిమా చరిత్రలోనే మొట్ట మొదటగా తెరెక్కిన ఆ మూవీ నిన్నటితో 92 సంవత్సరాలని పూర్తిచేసుకుంది. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని నిన్న హైదరాబాద్ లోని ప్రసాద్ ల్యాబ్స్ లో నేస్తం ఫౌండేషన్, తెలుగు సినిమా వేదిక అధ్వర్యంలో తెలుగు సినిమా పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. మునుపెన్నడూ లేని విధంగా అత్యంత ఘనంగా జరిగిన ఈ కార్యక్రమంలో 24 క్రాఫ్ట్స్ కి సంబంధించిన సీనియర్ టెక్నిషియన్స్ ని సత్కరించారు.అలాగే సినిమా ఇండస్ట్రీ కి వారు చేసిన సేవలను కూడా కొనియాడారు.ఈ కార్యక్రమంలో స్టార్ ప్రొడ్యూసర్ ఏ ఏం రత్నం కూడా పాల్గొన్నారు. ఈయన ప్రస్తుతం పవన్ కళ్యాణ్ తో హరిహరవీరమల్లుని నిర్మిస్తున్నాడు. ఇటీవలే ఆయన ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షులు గా కూడా ఎన్నికయ్యారు.

జె.వి.మోహన్ గౌడ్, విజయవర్మల నిర్మించిన ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి సినీనటులు బాబు మోహన్, సీనియర్ హీరోయిన్ కవిత, శివ పార్వతి, హాస్యనటుడు చిట్టిబాబు, నిర్మాత కైకాల నాగేశ్వరరావు, దర్శకులు గోపాలకృష్ణ లు కూడా పాల్గొని తెలుగు సినిమా విశిష్టతని వివరించారు. అలాగే తెలుగు చలనచిత్ర నిర్మాత మండలి అధ్యక్షులు కె.యల్.దామోదర ప్రసాద్, డిజిక్వెస్ట్ అధినేత బసిరెడ్డి, తెలంగాణ ఛాంబర్ కార్యదర్శి అనుపమ్ రెడ్డి, తెలుగు ఫిల్మ్ ఛాంబర్ EC మెంబర్ నాగులపల్లి పద్మిని లు కూడా పాల్గొన్నారు.
![]() |
![]() |