![]() |
![]() |

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప 2 చేస్తున్నాడు. ఈ చిత్రం షూటింగ్ ఏకధాటిగా జరుగుతూ ఉంది.ఆ మూవీకి సంబంధించిన అన్ని పనులు పూర్తికాగానే అల్లు అర్జున్ త్రివిక్రమ్ దర్శకత్వంలో తన తదుపరి చిత్రాన్ని చెయ్యబోతున్నాడు. ఈ విషయాన్ని అధికారకంగా కూడా ప్రకటించారు. తాజాగా ఆ మూవీలో నటించబోయే హీరోయిన్ విషయం ఇప్పుడు టాక్ అఫ్ ది ఇండస్ట్రీ అయ్యింది.
బన్నీ సరసన బాలీవుడ్ అగ్ర కథానాయిక దీపికా పదుకునే హీరోయిన్ గా చెయ్యబోతుందనే వార్తలు వస్తున్నాయి.ఈ విషయంపై చిత్ర బృందం మాత్రం ఎక్కడా అధికారకంగా ప్రకటించలేదు..కానీ ఈ వార్తలు నిజమే అనే వారు కూడా లేకపోలేదు. ఎందుకంటే ఇప్పుడు తెలుగు సినిమా పాన్ ఇండియా రేంజ్ కి ఎదిగింది.పైగా అన్ని భాషలకి సంబంధించిన ఆర్టిస్ట్ లు తెలుగు సినిమాలో మెరుస్తున్నారు. కలెక్షన్స్ కూడా అదే స్థాయిలో వసూలు అవుతున్నాయి. ప్రభాస్ తో తెరకెక్కుతున్న కల్కి లో కూడా దీపికా హీరోయిన్ గా చేస్తుంది. కాబట్టి దీపికా బన్నీ సినిమాలో నటించవచ్చని అంటున్నారు. బన్నీ అండ్ దీపికా కాంబో మాత్రం ఫిక్స్ అయితే కనుక అదొక క్రేజీ కాంబోగా నిలుస్తుందనటంలో ఎలాంటి సందేహం లేదు.
ఇక జులాయి, సన్ ఆఫ్ సత్యమూర్తి, అల వైకుంఠపురము ఇలా హాట్రిక్ విజయాలతో బన్నీ త్రివిక్రమ్ కాంబోకి ప్రేక్షకుల్లో మంచి ఇమేజ్ ఏర్పడింది. గుంటూరు కారం రిజల్ట్ తో బన్నీ సినిమాకి స్క్రిప్ట్ విషయంలో త్రివిక్రమ్ చాలా కేర్ తీసుకుంటున్నాడు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ మరియు గీతా ఆర్ట్స్ కలిసి ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని నిర్మించనున్నారు. థమన్ సంగీతాన్ని అందించనున్నాడు.
![]() |
![]() |