![]() |
![]() |

తెలుగు చలన చిత్ర పరిశ్రమలో మంచి సక్సెస్ రేట్ కలిగిన దర్శకుల్లో అనిల్ రావిపూడి కూడా ఒకరు. పటాస్ టూ భగవంత్ కేసరి వరకు సాగిన ఆయన జర్నీ నే అందుకు నిదర్శనం.తాజాగా తను నెక్స్ట్ తెరకెక్కించబోయే సినిమాకి సంబంధించిన విషయం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఆయన గతంలో మెగాస్టార్ చిరంజీవికి ఒక కథని వినిపించారని ఇప్పుడు ఆ కథ మరో అగ్ర హీరోతో తెరకెక్కబోతుందనే రూమర్లు షికార్లు చేస్తున్నాయి.
అనిల్ రావిపూడి మెగాస్టార్ చిరంజీవి వద్దన్న కథని విక్టరీ హీరో వెంకటేష్ కి చెప్పటం జరిగిందని ఆ కథ వెంకటేష్ కి నచ్చిందనే మాటలు పరిశ్రమ వర్గాల్లో వినిపిస్తున్నాయి. పైగా ఆ సినిమాకి హిట్ చిత్రాల నిర్మాత దిల్ రాజు నిర్మాతగా వ్యవహరిస్తున్నాడని కూడా అంటున్నారు.పైగా 2025 సంక్రాంతికి ఆ సినిమాని విడుదల చేసే ప్లాన్ లో కూడా దిల్ రాజు భావిస్తున్నాడని కూడా అంటున్నారు.ఇప్పటకే ఈ ముగ్గురి కాంబోలో ఎఫ్ 2 ,ఎఫ్ 3 లు వచ్చి మంచి విజయాన్ని సాధించాయి.

ఇక్కడ ఇంకో గమ్మత్తయిన విషయం ఏంటంటే చిరంజీవి రిజెక్ట్ చేసిన కథ ని వెంకటేష్ చెయ్యడం ఖాయమయ్యి ఆ సినిమా వచ్చే సంక్రాంతికి విడుదల అయితే కనుక అదిరిపోయే క్యూరియాసిటీ ని ప్రేక్షకుల్లో కలిగించినట్టే. ఎందుకంటే సంక్రాంతి కానుకగా మెగాస్టార్ తన విశ్వంభరని విడుదల చేస్తున్నాడు. ఆల్రెడీ అధికారకంగా ఆ విషయాన్నీ ప్రకటించారు. ఈ నేపథ్యంలో మెగాస్టార్ వద్దన్న కథ కి మెగాస్టార్ చేస్తున్న కథ కి పోటీ షురూ అయినట్టే.
![]() |
![]() |