![]() |
![]() |

డిసెంబర్ 1 న థియేటర్స్ లోకి అడుగుపెట్టిన యానిమల్(animal) ఇండియా వ్యాప్తంగా పెద్ద సంచలనమే సృష్టించింది. రణబీర్ కపూర్(ranbir kappor) రష్మిక (rashmikha) ల సూపర్ పెర్ ఫార్మెన్స్ అండ్ సందీప్ రెడ్డి (sandeep reddy)పవర్ ఫుల్ డైరెక్షన్ యానిమల్ కి భారీ విజయాన్ని అందించాయి. అందుకు నిదర్శనంగా యానిమల్ సుమారు 700 కోట్ల రూపాయిల దాకా వసూలు చేసి ఇండియన్ సినిమా హిస్టరీ లోనే వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ మూవీగా నిలిచింది.కాకపోతే ఆ మూవీ విడుదలైనప్పుడు ఎలా అయితే విమర్శలు వచ్చాయో ఇప్పడు కూడా పలు విమర్శలు వస్తున్నాయి. తాజాగా ఒక నటి యానిమల్ మీద చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యాయి
ఎన్నో సినిమాల్లో హీరోయిన్ గా క్యారక్టర్ ఆర్టిస్ట్ గా విలక్షణమైన పాత్రలు పోషించి ప్రస్తుతం బుల్లి తెర మీద ప్రేక్షకులని అలరిస్తున్న నటి కస్తూరి. ఆమె తాజాగా ఓటిటి లో దర్శనం ఇస్తున్న యానిమల్ మూవీని చూడటం జరిగింది. కానీ ఆమె సినిమాని పూర్తిగా కూడా చూడలేకపోయింది.పైగా ప్రేక్షకులు ఈ చిత్రాన్ని థియేటర్లో ఎలా చూశారంటు సోషల్ మీడియా వేదికగా తన ఆశ్చర్యాన్ని వ్యక్తం చేసింది.అంతలా విసుగుపుట్టిన సినిమాని ప్రేక్షకులు మూడున్నర గంటల పాటు థియేటర్లలో ఎలా చూసారో అర్ధం కావటంలేదు అని కూడా ఆమె చెప్పుకొచ్చింది.అసలు ఆటో ఫ్లైయింగ్ ప్లేన్‌లో హీరో హీరోయిన్ లు ప్రేమలో పడటం ఏంటి, మాట్లాడుకునే టైంలోనే అలా అయిపోవడం ఏంటి, అసలు వాళ్లు ఎక్కడికి వెళ్లారు. వామ్మో నన్ను తప్పుగా తీసుకోకండి అంటు చురకలు కూడా అంటించింది. పైగా దర్శకుడు సినిమాని పూర్తిగా టాప్ నాచ్‌లో తీశాడు ఆ స్థాయిని మనం అందుకోలేమని తనదైన స్టయిల్లో కౌంటర్లు కూడా వేసింది.
కస్తూరి అనే కాదు ఇప్పుడు తమిళ ప్రజల చాలా మంది దగ్గర నుంచి యానిమల్ మీద తీవ్ర వ్యతిరేకత వస్తుంది. మూవీలో పోలీస్ వ్యవస్థ ఉండదా పోలీసులు నిద్ర పోతోన్నారా అంటు సోషల్ మీడియా వేదికగా సెటైర్లు వేస్తున్నారు. అలాగే రక రకాలుగా యానిమల్ మీద ట్రోల్ల్స్ కూడా చేస్తున్నారు. దీంతో తెలుగు మూవీ లవర్స్ కొంత మంది విజయ్ లియో మణిరత్నం పొన్నియన్ సెల్వన్ సినిమాల్లోని సిల్లీ సీన్లను తెరపైకి తీసుకొస్తున్నారు.ఆ రెండు సినిమాలు ఎలా ఉన్నాయో చూసుకోండంటూ రివర్స్‌లో ట్రోలింగ్ చేస్తున్నారు. సీనియర్ నటీమణి రాధిక కూడా యానిమల్ పేరుని ప్రస్తావించకుండా అదొక చెత్త సినిమా అని పేర్కొంది.
![]() |
![]() |