![]() |
![]() |

మాచో స్టార్ గోపీచంద్ హీరోగా కన్నడ డైరెక్టర్ హర్ష దర్శకత్వంలో రూపొందుతోన్న సినిమా 'భీమా'. పదేళ్లుగా సాలిడ్ హిట్ కోసం ఎదుచూస్తున్న గోపీచంద్.. ఈ సినిమాపై ఎంతో నమ్మకం పెట్టుకున్నాడు. 2014లో వచ్చిన 'లౌక్యం' తర్వాత మాచో స్టార్ కి ఆ స్థాయి విజయం దక్కలేదు. ఆ లోటుని 'భీమా' తీరుస్తుందనే అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, టీజర్ ఆకట్టుకున్నాయి. తాజాగా ఈ మూవీ కొత్త రిలీజ్ డేట్ ని ప్రకటించారు మేకర్స్.
'భీమా' చిత్రాన్ని ఫిబ్రవరి 16న విడుదల చేయనున్నట్లు ఆమధ్య ప్రకటించారు. అయితే ఇప్పుడు ఈ సినిమాని మూడు వారాలు ఆలస్యంగా రిలీజ్ చేయనున్నట్లు తెలుపుతూ కొత్త తేదీని ప్రకటించారు. మహా శివరాత్రి కానుకగా మార్చి 8న విడుదల చేస్తున్నట్లు తెలియజేస్తూ ఒక పోస్టర్ ను వదిలారు. పోస్టర్ లో గోపీచంద్ ఖాకీ దుస్తుల్లో పవర్ ఫుల్ గా కనిపిస్తున్నాడు.
శ్రీ సత్య సాయి ఆర్ట్స్ బ్యానర్ పై కె.కె.రాధామోహన్ నిర్మిస్తున్న ఈ సినిమాకి రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నాడు.
![]() |
![]() |