![]() |
![]() |

పేరుకే ఆమె మలయాళ భామ. కానీ తమిళ చిత్ర సీమలో హీరోయిన్ గా తన కంటు గుర్తింపుని తెచ్చుకొని తన నటనతో ఎంతో మంది అభిమానులని సంపాదించుకుంది. ఆ హీరోయిన్ ఎవరో కాదు ఇనయ. అందానికి అందం నటనకి నటన తన సొంతం. తాజాగా ఆమె తన కెరీర్ కి సంబంధించి చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టిస్తున్నాయి.
ఇనయ ఒక పక్కన సినిమాలతో పాటు వ్యాపార రంగంలోను రాణిస్తు బిజీగా ఉంది. ఆమె అనోరా ఆర్ట్ స్టూడియో ద్వారా మహిళల వస్త్ర దుకాణాన్ని ఎంతో విజయవంతంగా నిర్వహిస్తుంది.తాజాగా ఆ స్టూడియో ప్రారంభించి వన్ ఇయర్ అవుతున్న సందర్భంగా తొలి వార్షికోత్సవాన్ని ఇనయ చాలా ఘనంగా నిర్వహించింది. ఈ కారక్రమానికి పలువురు సినీ ప్రముఖులు పాల్గొని ఆమెకి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా ఆమె పలు ఆసక్తికర విషయాలని వెల్లడి చేసింది. తన కెరీర్ తొలినాళ్ళల్లో ఒక డైరెక్టర్ నన్ను అసలు సినిమాలకి పనికి రావని అవమానించాడని కానీ ఇప్పుడు తమిళ మలయాళ భాషలకి చెందిన సినిమాలతో పాటు వ్యాపార రంగంలో కూడా రాణిస్తున్నానని ఆమె చెప్పింది. కాకపోతే ఆ డైరెక్టర్ ఎవరనే విషయాన్ని మాత్రం వెల్లడి చెయ్యలేదు. ఇనయ లేటెస్ట్ గా యోగేష్ బాబు తో తుక్కుదురై అనే కామెడీ చిత్రంలో నటించింది.
![]() |
![]() |