![]() |
![]() |

మాస్ మహారాజా రవితేజ (Raviteja) క్రేజీ డైరెక్టర్ హరీష్ శంకర్(harish shankar) ల కాంబినేషన్ కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పని లేదు. ఆ ఇద్దరి కాంబోలో 2011 లో వచ్చిన మిరపకాయ మూవీ కి నేటికీ ఎంతో మంది ఫ్యాన్స్ ఉన్నారు.ఆ మూవీ ద్వారా ఒక కొత్త రవితేజ ప్రేక్షకులకి పరిచయమయ్యాడు. అలాగే హరీష్ కూడా ఆ మూవీతోనే స్టార్ డైరెక్టర్ గా మారాడు.మళ్ళీ ఇన్నాళ్ళకి ఆ ఇద్దరి కాంబో లో మిస్టర్ బచ్చన్ అనే ఒక ఎగ్జయిటింగ్ టైటిల్ తో మూవీ తెరకెక్కుతుంది. లేటెస్ట్ గా ఆ మూవీకి సంబంధించిన న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
మిస్టర్ బచ్చన్ షూటింగ్ తాజా షెడ్యూల్ తమిళనాడు లోని కరైకుడి లో జరగనుంది. ఈ మేరకు రవితేజ, హరీష్ లు ప్రత్యేక ఫ్లైట్ లో కరైకుడి బయలుదేరి వెళ్లారు. ఇప్పుడు వాటి తాలూకు పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రవితేజ సరసన భాగ్యశ్రీ భొర్సే హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీలో గబ్బర్ సింగ్ విలన్ అభిమన్యు సింగ్ ఒక కీలక పాత్రని పోషిస్తున్నాడు.హిట్ చిత్రాల నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా మిస్టర్ బచ్చన్ ని నిర్మిస్తున్న ఈ చిత్రంలో తెలుగు చిత్ర పరిశ్రమకి చెందిన భారీ తారాగణమంతా నటిస్తుంది.

రవి తేజ అండ్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ కాంబోలో ఇంతకు ముందు ధమాకా వచ్చి రవి తేజ కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. అలాగే రేపు ఫిబ్రవరి 9 న రాబోయే ఈగిల్ (Eagle) కూడా పీపుల్ నిర్మాణ సంస్థదే.ఇప్పుడు ముచ్చటగా మూడో సారి మిస్టర్ బచ్చన్ ని నిర్మిస్తున్నారు. 2018 లో సూపర్ హిట్ గా నిలిచిన బాలీవుడ్ హిట్ మూవీ రెయిడ్ కి అఫీషియల్ రీమేక్ గా మిస్టర్ బచ్చన్ రూపొందుతుంది. అజయ్ దేవగన్ ఇలియానా ఆ మూవీలో హీరో హీరోయిన్లుగా నటించారు.
![]() |
![]() |