![]() |
![]() |

యంగ్ టైగర్ ఎన్టీఆర్ నయా మూవీ దేవర. ఈ మూవీ కోసం ఎన్టీఆర్ ఫ్యాన్స్ తో పాటు ఆల్ ఓవర్ ఇండియా మొత్తం ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తుంది. పాన్ ఇండియా చిత్రంగా తెరకెక్కుతున్నదేవరలో శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్,సైఫ్ అలీ ఖాన్ లాంటి బాలీవుడ్ యాక్టర్స్ కూడా నటిస్తున్నారు. తాజాగా ఎన్టీఆర్ మీద బాలీవుడ్ లో ట్రోల్ జరగటం సంచలనం సృష్టిస్తుంది.
బాలీవుడ్ అగ్ర నటులైన అక్షయ్ కుమార్,టైగర్ ష్రఫ్ లు కలిసి బడేమియా చోట మియా అనే మూవీలో నటిస్తున్నారు. ఏప్రిల్ 10న విడుదల కాబోతున్న ఈ మూవీకి ఎన్టీఆర్ భయపడి తన దేవర ని పోస్ట్ పోన్ చేస్తున్నాడంటూ బాలీవుడ్ ఎన్టీఆర్ మీద ట్రోల్ల్స్ చేస్తుంది. దేవర వెనక్కి వెళ్లే పరిస్థితులని కనిపెట్టిన బాలీవుడ్ పని గట్టుకొని మరి ట్రోల్ల్స్ చేస్తుంది దేవర షూటింగ్ స్టార్ అయినప్పటి నుంచి కూడా దేవర వరల్డ్ వైడ్ గా ఏప్రిల్ 5 న రిలీజ్ అవుతుందనే విషయాన్ని మేకర్స్ అఫిషియల్ గా డిక్లైర్ చేసారు.

కానీ ఇటీవల జరిగిన షూటింగ్ లో విలన్ గా నటిస్తున్న సైఫ్ అలీ ఖాన్ గాయాలు పాలవ్వడం జరిగింది. దీంతో చిత్ర బృందం కొన్ని రోజులు షూటింగ్ కి బ్రేక్ ఇవ్వాల్సి వచ్చింది. పైగా సినిమాకి సంబంధించిన విఎఫ్ఎక్స్ వర్క్ కూడా లేటు అవుతు వస్తుంది. ఈ కారణాలన్నీ అటు ఉంచితే ముఖ్యంగా ఏప్రిల్ నెల చివరలో ఇండియా వైడ్ గా లోక్ సభ ఎన్నికలతో పాటు ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ ఎలక్షన్స్ జరగనున్నాయి.ఈ కారణాలతో దేవర ని పోస్ట్ పోన్ చేసే ఆలోచనలో మేకర్స్ ఉన్నారనే మాటలు వినిపిస్తున్నాయి. అగస్ట్ లేదా సెప్టెంబర్ లో దేవర విడుదల అవుతుందని అంటున్నారు. ఇక ఎన్టీఆర్ మీద బాలీవుడ్ చేస్తున్న ట్రోల్ల్స్ ని చూస్తున్న ఫ్యాన్స్ అండ్ తెలుగు ప్రేక్షకులు ఎన్టీఆర్ అంటే బాలీవుడ్ కి అంత భయమెందుకని అంటున్నారు. గత కొంత కాలం నుంచి బాలీవుడ్ సౌత్ సినిమాల మీద తన అక్కసుని వెల్లగక్కుతూనే ఉంది. ఏది ఏమైనా తెలుగు సినిమా భయం బాలీవుడ్ కి పట్టుకుందనే మాట మాత్రం వాస్తవం.
![]() |
![]() |