![]() |
![]() |

ఇంచుమించు రెండు దశాబ్దాల నుంచి వివిధ భాషల్లో సినిమాలు చేస్తు ఇండియన్ సిల్వర్ స్క్రీన్ మీద తనకంటు ఒక ఇమేజ్ ని సంపాదించుకున్న నటి తమన్నా భాటియా(Tamannaah bhatia) అభిమానుల చేత మిల్క్ బ్యూటీగా పిలిపించుకునే ఆమె తెలుగు సినిమాల్లో కూడా తన సత్తాని చాటుతు ఉంది. నేటికీ తన అందంతో నటనతో కొత్త హీరోయిన్లకి పోటీని ఇస్తు తన దైన స్టైల్లో రాణిస్తు ఉంది. మొన్న ఆ మధ్య వచ్చిన జైలర్ (jailer) లో నువ్వు కావాలయ్యా అనే సాంగ్ తో ప్రపంచ వ్యాప్తంగా తన క్రేజ్ మరింత పెరిగింది.ఇప్పుడు లేటెస్ట్ గా ఆమెకి సంబంధించిన పిక్స్ సోషల్ మీడియాని ఒక ఊపు ఉపుతున్నాయి
తమన్నా అస్సాం రాజధాని గౌహతి లో ని కామరూపా ప్రాంతంలో ఉన్న కామాఖ్య అమ్మవారిని దర్శించుకుంది.ఈ కామాఖ్య అమ్మవారు ఎంతో మహిమగల తల్లి. కోరిన కోర్కెల్ని నెరవేర్చే కల్పవల్లిగా ఆ ప్రాంత ప్రజలు భావిస్తారు. ఆలయాన్ని దర్శించుకున్న తమన్నా అమ్మవారిని భక్తితో వేడుకొని ప్రతేక్య పూజలు నిర్వహించింది.పైగా కంప్లీట్ గా ఒక భక్తు రాలిగా మారిపోయి మెడలో హారం, శాలువా, నుదుటన కుంకుమని ధరించింది. ప్రస్తుతం వాటి తాలూకు పిక్స్ సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తున్నాయి.అలాగే తమన్నా తో పాటు ఆమె కుటుంబ సభ్యులు కూడా ఈ పూజల్లో పాల్గొన్నారు.

తమన్నా ఎంత పెద్ద హీరోయిన్ అయినా కూడా మొదటి నుంచి ఆమెకి ఆధ్యాత్మిక బావాలు ఎక్కువ ఏదో శక్తీ తనని అంత స్థాయికి తీసుకొచ్చిందనే నమ్మకం కూడా ఆమెకి చాలా ఎక్కువ. అందుకే తనకి తీరిక దొరికినప్పుడల్లా రకరకాల దేవాలయాలని సందర్శిస్తుంటుంది. అలాగే ఆమె ప్రతి సంవత్సరం ప్రముఖ ఆధ్యాత్మిక సంస్థ ఈషా ఫౌండేషన్ (isha foundation)ఆధ్వర్యంలో నిర్వహించే శివరాత్రి ఉత్సవాలతో పాటు లింగ భైరవి పూజల్లో కూడా పాల్గొంటుంది. ప్రస్తుతం ఆమె తమిళ హిందీ భాషలకి చెందిన రెండు సినిమాల్లో నటిస్తుంది. ఈ సంవత్సరం అవి ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.
![]() |
![]() |