![]() |
![]() |
ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికల హడావిడి మొదలైంది. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు ఒకేసారి జరగనుండడంతో అక్కడి రాజకీయ పార్టీలు తమ వ్యూహ రచనలో బిజీగా ఉన్నారు. ఇప్పటికే వివిధ పార్టీలు ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేస్తున్నాయి. కొత్తగా రాజకీయ ప్రవేశం చేసేవారు, ఒక పార్టీ నుంచి మరో పార్టీలోకి మారే వారితో రాజకీయ పార్టీల కార్యాలయాలు కళకళలాడుతున్నాయి.
తాజాగా తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్, ప్రముఖ నటుడు పృథ్విరాజ్ జనసేన పార్టీలో చేరారు. పార్టీ అధ్యక్షుడు పవన్‌కళ్యాణ్ సమక్షంలో వీరిరువురూ పార్టీలో చేరారు. బుధవారం సాయంత్రం మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో జానీ మాస్టర్, పృథ్విరాజ్‌లకు కండువా వేసి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు పవన్‌కళ్యాణ్.
![]() |
![]() |