![]() |
![]() |
తమిళనాడులో పుట్టి మలయాళ సినిమాలతోనే ఎక్కువ పాపులారిటీ సంపాదించుకున్న సాయిపల్లవి తెలుగు, తమిళ్ భాషల్లో పలు సినిమాల్లో నటించి ఉత్తమ నటిగా ఎన్నో అవార్డులు గెలుచుకుంది సాయిపల్లవి. తెలుగులో ఆమెకు ఉన్న ఫాలోయింగ్ గురించి చెప్పక్కర్లేదు. ఫిదా చిత్రంలోని ఆమె నటనకు, డాన్స్‌కు తెలుగు ఆడియన్స్ ఫిదా అయిపోయారు. ఈటీవీలో ఢీ షోలో తన డాన్స్‌తో అందర్నీ అలరించిన సాయిపల్లవి ఇటీవల చెల్లెలు పూజా కన్నన్ ఎంగేజ్‌మెంట్‌లోనూ తన డాన్స్ అందర్నీ అలరించింది. ఆ ఎంగేజ్‌మెంట్‌లో సాయిపల్లవి చేసిన డాన్స్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
పూజా కన్నన్ కూడా ఒక సినిమాలో హీరోయిన్‌గా నటించింది. అయితే ఆ తర్వాత మరో సినిమా చెయ్యలేదు. చాలాకాలంగా వినీత్ అనే వ్యక్తితో ప్రేమలో ఉన్న పూజ తమ పెళ్లికి పెద్దల అంగీకారం కూడా తీసుకుంది. తన పెళ్లి విషయాన్ని సోషల్ మీడియాలో కూడా ప్రకటించింది. ఆదివారం పూజ, వినీత్‌ల నిశ్చితార్ధం జరిగింది. ఆ సమయంలో సాయి పల్లవి ఆనందంతో తన చెల్లెలు కొంతమంది బంధువులతో కలిసి డాన్స్ చేసింది. ఈ నిశ్చితార్థానికి సంబంధించిన ఫోటోలు కూడా నెట్టింట్లో సందడి చేస్తున్నాయి. వీరి పెళ్లి ఎప్పుడు? ఎక్కడ? అనే విషయంలో మాత్రం వారి ఫ్యామిలీ క్లారిటీ ఇవ్వలేదు.
![]() |
![]() |