![]() |
![]() |

'బేబీ', 'టాక్సీవాలా' వంటి విజయవంతమైన చిత్రాలతో నిర్మాతగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు ఎస్‌కెఎన్. ఇటీవల ఆయన తన తండ్రిని కోల్పోయిన సంగతి తెలిసిందే. ఎస్‌కెఎన్ ఇంకా ఆ బాధలోనే ఉన్నాడు. కాగా ఈరోజు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హైదరాబాద్‌లోని ఎస్‌కెఎన్ నివాసానికి వెళ్లి ఆయనకు ఓదార్పునిచ్చాడు. ఎస్‌కెఎన్ తండ్రి చిత్రపటానికి నివాళులు అర్పించాడు.
ఎస్‌కెఎన్ మొదటి నుంచి మెగా కాంపౌండ్ కి దగ్గరగా ఉంటూ వస్తున్నాడు. ముఖ్యంగా అల్లు అర్జున్ అంటే ప్రత్యేక అభిమానాన్ని చూపిస్తాడు. బన్నీని తన కుటుంబ సభ్యుడిగా భావిస్తాడు. అలాంటిది తన ఇంటి పెద్ద మరణిస్తే.. బన్నీ తన ఇంటికి వచ్చి ఓదార్చడం ఎస్‌కెఎన్ కి ఎంతో ధైర్యాన్ని ఇచ్చింది. "ఇలాంటి కష్ట సమయంలో నా ఇంటికి వచ్చినందుకు, నాకు ధైర్యం చెప్పినందుకు నా ప్రియమైన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారికి నేను చాలా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. మా నాన్నగారి మృతికి ఆయన వచ్చి సంతాపం తెలియ చేసినందుకు ధన్యవాదాలు." అంటూ ఎస్‌కెఎన్ ఎమోషనల్ ట్వీట్ చేశాడు.

![]() |
![]() |