![]() |
![]() |

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తనయుడు అకీరా సినీ రంగ ప్రవేశం కోసం మెగా అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. మరి అకీరా సినీ రంగ ప్రవేశం ఎప్పుడు ఉంటుందో తెలియదు కానీ.. అతనికి సంబంధించిన ఏ చిన్న అప్డేట్ వచ్చినా ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు. ప్రస్తుతం అకీరా లేటెస్ట్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
మెగా ఇంట సంక్రాంతి సంబరాలు ఘనంగా జరుగుతున్నాయి. బెంగళూరులోని రామ్ చరణ్ ఫామ్ హౌస్ లో చిరంజీవి, అల్లు అరవింద్ కుటుంబ సభ్యులు సంక్రాంతి సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఈ సందర్భంగా చిరంజీవి సోషల్ మీడియా వేదికగా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఓ ఫోటో పంచుకున్నారు. అందులో చిరంజీవి, అరవింద్, నాగబాబు, రామ్ చరణ్, అల్లు అర్జున్, వరుణ్ తేజ్ ఇలా దాదాపు కుటుంబ సభ్యులందరూ ఉన్నారు. పవన్ కళ్యాణ్ ఒక్కరే మిస్ అయ్యారు. అయితే ఈ సంబరాల్లో పవన్ లేని లోటుని ఆయన కుమారుడు అకీరా భర్తీ చేశాడు. ఆ ఫొటోలో అకీరా ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు. అకీరా ఫోటోలు చూసి "కటౌట్ అదిరిపోయింది", "వారసుడు వస్తున్నాడు" అంటూ అభిమానులు కామెంట్లు పెడుతూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

![]() |
![]() |