![]() |
![]() |

ఇటీవల విడుదలైన గ్లింప్స్ తో 'దేవర' మూవీ అందరినీ సర్ ప్రైజ్ చేసింది. జూనియర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ పాన్ ఇండియా మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. యువసుధ ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకి సంబంధించి తాజాగా కీలక అప్డేట్ వచ్చింది.
'దేవర' డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ని ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. ఈ విషయాన్ని నెట్ ఫ్లిక్స్ తాజాగా అధికారికంగా ప్రకటించింది. థియేటర్లలో విడుదలైన ఎనిమిది వారాల తర్వాత నెట్ ఫ్లిక్స్ లో అందుబాటులోకి వచ్చే అవకాశముంది. తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది. కాగా 'దేవర' డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ని నెట్ ఫ్లిక్స్ రికార్డు ధరకు దక్కించుకున్నట్లు సమాచారం.

అనిరుధ్ సంగీతం అందిస్తున్న 'దేవర'లో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుండగా, సైఫ్ అలీ ఖాన్ విలన్ గా నటిస్తున్నాడు. ఈ సినిమా రెండు భాగాలుగా రానుంది. మొదటి భాగం ఈ ఏడాది ఏప్రిల్ 5న విడుదల కానుంది.
![]() |
![]() |