![]() |
![]() |

'అతడు', 'ఖలేజా' తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన చిత్రం 'గుంటూరు కారం'. హారిక & హాసిని క్రియేషన్స్ నిర్మించిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదలైంది. ఈ మూవీ డివైడ్ సొంతం చేసుకున్నప్పటికీ.. బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల వర్షం కురిపిస్తోంది. ప్రొడ్యూసర్స్ లెక్కల ప్రకారం ఈ చిత్రం మూడు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.164 కోట్ల గ్రాస్ రాబట్టింది.
'గుంటూరు కారం' సినిమా మొదటి రోజు వరల్డ్ వైడ్ గా రూ.94 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసినట్లు మేకర్స్ ప్రకటించారు. ఇక రెండో రోజు రూ.33 కోట్ల గ్రాస్, మూడో రోజు రూ.37 కోట్ల గ్రాస్ తో.. మూడు రోజుల్లో రూ.164 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్లు మేకర్స్ అనౌన్స్ చేశారు. ప్రొడ్యూసర్స్ లెక్కలు ఇలా ఉంటే.. ట్రేడ్ వర్గాలు మాత్రం ఈ సినిమా మూడు రోజుల్లో వరల్డ్ వైడ్ గా రూ.115-120 కోట్ల గ్రాస్ రాబట్టినట్టు అంచనా వేస్తున్నాయి. ఏది ఏమైనా ఒక రీజినల్ సినిమాకి, అందునా డివైడ్ టాక్ తో ఈ రేంజ్ లో వసూళ్లు రాబట్టడం మహేష్ కే సాధ్యమని అభిమానులు అభిప్రాయపడుతున్నారు.
.webp)
![]() |
![]() |