![]() |
![]() |

ఈ సంక్రాంతికి మెగా కాంపౌండ్ నుండి ఒక్క సినిమా కూడా రాలేదన్న నిరాశలో మెగా అభిమానులు ఉన్నారు. ఆ లోటుని భర్తీ చేయడం కోసం అన్నట్టుగా మెగాస్టార్ చిరంజీవి అదిరిపోయే అప్డేట్ తో వచ్చారు. ఆయన కొత్త సినిమా టైటిల్ ని రివీల్ చేశారు.
చిరంజీవి తన 156వ సినిమాని 'బింబిసార' ఫేమ్ మల్లిడి వశిష్ట దర్శకత్వంలో చేస్తున్న సంగతి తెలిసిందే. యూవీ క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ సోషియో ఫాంటసీ ఫిల్మ్ టైటిల్ ని తాజాగా అనౌన్స్ చేశారు. ముందునుంచి ప్రచారం జరుగుతున్నట్లుగానే ఈ సినిమాకి 'విశ్వంభర' టైటిల్ ని ఫిక్స్ చేశారు. ఈ సందర్భంగా విడుదల చేసిన కాన్సెప్ట్ వీడియో అదిరిపోయింది. అంతేకాదు రిలీజ్ డేట్ ని రివీల్ చేశారు మేకర్స్. "వచ్చే సంక్రాంతికి కలుద్దాం" అంటూ 2025 సంక్రాంతికి విడుదల చేయనున్నట్లు తెలిపారు.

కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్ గా ఛోటా కె. నాయుడు, ఆర్ట్ డైరెక్టర్ గా ఏఎస్ ప్రకాష్ వ్యవహరిస్తుండగా.. ఎడిటింగ్ బాధ్యతలు కోటగిరి వెంకటేశ్వరరావు, సంతోష్ కామిరెడ్డి చూస్తున్నారు.
![]() |
![]() |