![]() |
![]() |

సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాలకి తెలుగునాట ఎంత క్రేజ్ ఉంటుందో ఓవర్సీస్ లో కూడా అంతే క్రేజ్ ఉంటుంది. మహేష్ నటించిన చాలా సినిమాలు అక్కడ రికార్డు కలెక్షన్స్ సాధించాయి. తాజాగా గుంటూరు కారం కూడా యుఎస్ లో అదిరిపోయే రికార్డు సాధించింది.
గుంటూరు కారం ప్రీమియర్ షోస్ తో 1 .4 మిలియన్ డాలర్స్ ని రాబట్టింది. మహేష్ కెరీర్ లోనే ఇది హైయ్యస్ట్ అని చెప్పవచ్చు. సినిమా రిజల్ట్ తో సంబంధం లేకుండా గుంటూరుకారం ఆ స్థాయిలో కలెక్షన్స్ ని సాధించడం పట్ల పలువురు ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు. రాబోయే రోజుల్లో 2 మిలియన్ డాలర్స్ ని సాధిస్తుందని అంటున్నారు.అలాగే ఈ కలెక్షన్స్ తో యు ఎస్ లో మహేష్ కి స్టార్ డమ్ కి ఉన్న స్టామినా మరో సారి రుజవయ్యింది.
తెలుగునాట ఈ రోజు విడుదలైన గుంటూరుకారం విడుదలైన అన్ని చోట్ల రికార్డు స్థాయి కలెక్షన్స్ ని సాధిస్తుంది. ఓపెనింగ్స్ కూడా భారీ స్థాయిలో వచ్చాయి. మూవీ కూడా పర్వాలేదనే టాక్ తో ముందుకు వెళ్తుంది. రాబోయే రోజుల్లో ఫలితం ఎలా ఉంటుందో చూడాలి.
![]() |
![]() |