![]() |
![]() |

అక్కినేని నాగార్జున (Nagarjuna) హీరోగా విజయ్ బిన్ని దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా 'నా సామి రంగ' (Naa Saami Ranga). అల్లరి నరేష్, రాజ్ తరుణ్ ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ యాక్షన్ ఎంటర్టైనర్ జనవరి 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్, టీజర్, ఇతర ప్రచార చిత్రాలు ఆకట్టుకోవడంతో ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో మంచి మంచి అంచనాలున్నాయి. తాజాగా ఈ మూవీ ట్రైలర్ విడుదలైంది.
"కిష్టయ్యను కొట్టే మగాడు ఎవడైనా ఉన్నాడా అసలు" అంటూ అల్లరి నరేష్ చెప్పే డైలాగ్ తో ట్రైలర్ ప్రారంభమైంది. "ఈసారి పండక్కి నా సామి రంగ" అంటూ అదిరిపోయే బీట్, ఫైట్ సీక్వెన్స్ తో నాగార్జున ఎంట్రీ ఆకట్టుకుంది. నాగ్ లవ్ స్టోరీ గురించి రాజ్ తరుణ్ కి నరేష్ చెప్పడం, అలాగే నాగార్జున తనలోని రొమాంటిక్ యాంగిల్ ని మళ్ళీ బయటకు తీసుకురావడం వంటి సన్నివేశాలు మెప్పించాయి. ఆ తర్వాత రొమాంటిక్ మూడ్ నుంచి ఒక్కసారిగా యాక్షన్ టర్న్ తీసుకుంది ట్రైలర్. అసలు కిష్టయ్య ఎవరు? ఎందుకు కత్తి పట్టాడు? ఈ కథకి ప్రభలతీర్థానికి ఉన్న సంబంధమేంటి? వంటి ప్రశ్నలను రేకెత్తిస్తూ ట్రైలర్ ఎంతో ఆసక్తికరంగా నడిచింది. ఇక ట్రైలర్ చివరిలో బీడీ షాట్, "అందరికీ పండగ శుభాకాంక్షలు" అని నాగ్ చెప్పడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. మొత్తానికి యాక్షన్, ఎంటర్టైన్మెంట్, రొమాన్స్, ఎమోషన్స్ కలగలిసి అసలుసిసలైన పండగ సినిమా అనే అభిప్రాయాన్ని 'నా సామి రంగ' ట్రైలర్ కలిగిస్తోంది.

గతంలో 'సోగ్గాడే చిన్నినాయనా', 'బంగార్రాజు' వంటి సినిమాలతో సంక్రాంతికి వచ్చి హిట్ కొట్టిన నాగార్జున.. 'నా సామి రంగ'తో మరోసారి ఆ మ్యాజిక్ రిపీట్ చేస్తాడేమో చూడాలి.
![]() |
![]() |