![]() |
![]() |

తేజ సజ్జా హీరోగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా 'హనుమాన్'. ప్రైమ్ షో ఎంటర్‌టైన్‌మెంట్ నిర్మించిన ఈ సూపర్ హీరో ఫిల్మ్ జనవరి 12న విడుదలవుతోంది. ఈ చిత్రంపై మొదటి నుంచి మంచి అంచనాలు ఉన్నాయి. టీజర్, ట్రైలర్ రిలీజ్ తర్వాత ఆ అంచనాలు రెట్టింపు అయ్యాయి. మరోవైపు మేకర్స్ కూడా సినిమా పట్ల తమకున్న నమ్మకానికి అద్దంపట్టేలా పెయిడ్ ప్రీమియర్లకు సిద్ధమయ్యారు. ఈ ప్రీమియర్ షోల బుకింగ్స్ కి అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది.
జనవరి 11న సాయంత్రం నుంచి పలు చోట్ల 'హనుమాన్' పెయిడ్ ప్రీమియర్ షోలు మొదలు కానున్నాయి. ఇప్పటికే బుకింగ్స్ ఓపెన్ కాగా సూపర్ రెస్పాన్స్ లభిస్తోంది. హైదరాబాద్, వైజాగ్ సహా కొన్ని చోట్ల షోలు ఓపెన్ కాగా.. వెంటనే సోల్డ్ అయ్యాయి. బుకింగ్స్ కి మంచి స్పందన వస్తుండటంతో మేకర్స్ మరిన్ని షోలు వేయడానికి సిద్ధమవుతున్నారు. ఒక యంగ్ హీరో, యంగ్ డైరెక్టర్ కలిసి చేసిన ఈ మూవీ ప్రీమియర్ షోల బుకింగ్స్ కి ఈ స్థాయి రెస్పాన్స్ రావడం హాట్ టాపిక్ గా మారింది. పాజిటివ్ టాక్ వస్తే ఈ సినిమా బాక్సాఫీస్ సంచలనాలు సృష్టించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.
![]() |
![]() |