![]() |
![]() |
నయనతార ప్రధాన పాత్రలో నటించిన ‘అన్నపూర్ణి’ చిత్రానికి కష్టాలు వచ్చాయి. ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమాలో శ్రీరాముడ్ని కించపరిచే సన్నివేశాలు ఉన్నాంటూ శివసేన నేత రమేష్ సోలంకి ముంబయి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
డిసెంబర్ 1న విడుదలైన ‘అన్నపూర్ణి’ చిత్రాన్ని డిసెంబర్ 29 నుంచి నెట్‌ఫ్లిక్స్ ద్వారా స్ట్రీమింగ్ చేస్తున్నారు. థియేటర్లలో తమిళ్ భాషలోనే రిలీజ్ చేశారు. కానీ, ఓటీటీ విషయానికి వచ్చేసరికి తెలుగు, మలయాళం, కన్నడ భాషల్లో స్ట్రీమ్ అవుతోంది. ఈ చిత్రంలోని కొన్ని సీన్లు హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా ఉన్నాయనే ఆరోపణలు వస్తున్నాయి. ఓ హిందూ పూజారి కుమార్తె నమాజు చదవడం, బిర్యానీ వండడం చూపించారని రమేశ్ సోలంకి వెల్లడిరచారు. అలాగే శ్రీరాముడు కూడా మాంసాహారేనని సినిమాలోని ఓ పాత్రచే చెప్పించారు. త్వరలోనే అయోధ్యలో రామమందిరం ప్రాణప్రతిష్ట జరగబోతోంది. ఈ క్రమంలోనే అన్నపూర్ణి చిత్రాన్ని ఉద్దేశపూర్వకంగానే విడుదల చేశారని ఆరోపించారు. అలాగే లవ్ జిహాద్‌ను ఈ సినిమా బలపరిచేలా ఉందని రమేశ్ సోలంకి విమర్శించారు. ఈ క్రమంలోనే దర్శకుడు నీలేశ్‌కృష్ణ , హీరో జై, హీరోయిన్ నయనతార, జతిన్ సేథీ (నాడ్ స్టూడియోస్), ఆర్.రవీంద్రన్ (ట్రైడెంట్ ఆర్ట్స్), పునీత్ గోయెంకా (జీ స్టూడియోస్), షరీఖ్ పటేల్, మోనికా షేర్ గిల్ (నెట్ ఫ్లిక్స్ ఇండియా)లపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని రమేశ్ సోలంకి ముంబాయి పోలీసులను కోరారు.
![]() |
![]() |