![]() |
![]() |

నందమూరి బాలకృష్ణ ( Balakrishna) నట వారసుడు నందమూరి మోక్షజ్ణ( mokshagna) సిల్వర్ స్క్రీన్ మీద ఈ సంవత్సరం మెరవబోతున్నాడు. స్వయంగా బాలయ్యే మోక్షజ్ణ ఎంట్రీ ఈ ఏడాది ఉంటుందని ప్రకటించాడు. కానీ ఆ మూవీ కి ఎవరు డైరెక్షన్ చేస్తారు..ఎలాంటి కథ ఉంటుంది అని నందమూరి అభిమానుల తో పాటు ప్రేక్షకుల్లోనే క్యూరియాసిటీ ఉంది. తాజాగా ఫిలిం సర్కిల్స్ లో మోక్షజ్ణ నటించబోయే సినిమా ఇదే అంటు ఒక క్రేజీ న్యూస్ చక్కర్లు కొడుతుంది.
బాలయ్య , బోయపాటి శ్రీను( boyapati srinu)కాంబోలో తెరకెక్కబోయే అఖండ 2 (akhanda 2) లో మోక్షజ్ణ ఒక పవర్ ఫుల్ పాత్రలో నటించబోతున్నాడు.
అఖండ 2 లో ఒక పవర్ ఫుల్ ఎపిసోడ్ ఉందని బోయపాటి ఒక రేంజ్ లో మోక్షజ్ణ కోసం స్క్రిప్ట్ రెడీ చేశాడనని అంటున్నారు. కాకపోతే అఖండ 2 లో మోక్షజ్ణ నటిస్తున్నాడనే వార్తలు అధికారకంగా రాకపోయినప్పటికీ బోయపాటి డైరెక్షన్ లోనే మోక్షజ్ఞ ఎంట్రీ అనేది పక్కా అని మాత్రం అంటున్నారు. సోషల్ మీడియాలో వస్తున్న ఈ వార్తతో నందమూరి అభిమానులు అయితే ఫుల్ జోష్ లో ఉన్నారు. అలాగే బోయపాటి డైరెక్షన్ లో మోక్షజ్ణ నటిస్తే చూడాలనే ఇంట్రెస్ట్ కూడా రోజు రోజుకి ఫ్యాన్స్ లో పెరుగుతుంది.
పెద్దాయన ఎన్టీఆర్(ntr)నటవారసుడిగా సినీ రంగ ప్రవేశం చేసిన బాలకృష్ణ కూడా మొదట ఎన్టీఆర్ సినిమాల్లోనే గెస్ట్ రోల్స్ లో నటించాడు. ఆ తర్వాత తెలుగు చిత్ర సీమలో బాలయ్య టాప్ హీరోగా కొనసాగుతున్నట్టే మోక్షజ్ఞ కి కూడా ఇప్పుడే అదే సెంటిమెంట్ వర్క్ అవుట్ అయ్యి నెంబర్ వన్ హీరోగా ఎదగడం ఖాయమని బాలయ్య ఫ్యాన్స్ భావిస్తున్నారు.
![]() |
![]() |