![]() |
![]() |
.webp)
ఆదిరెడ్డి అంటే కామన్ మ్యాన్ కేటగిరీలో బిగ్ బాస్ సీజన్ 6 కి వెళ్లి అద్భుతంగా తన స్టయిల్లో గేమ్ ఆడి వచ్చిన వ్యక్తి అని అందరికీ తెలుసు. తాను ఎన్నో కష్టాలు పడి బిగ్ బాస్ సీజన్ 2 నుంచి రివ్యూస్ చెప్పుకుంటూ చివరికి అదే బిగ్ బాస్ హౌస్ లో కంటెస్టెంట్ గా వెళ్లి ఇప్పుడు లైఫ్ ని సెట్ చేసుకున్నాడు. విజయవాడలో సొంతంగా ఒక సెలూన్ కూడా ఓపెన్ చేసాడు. అలాంటి ఆదిరెడ్డికి బిగ్ బాస్ సీజన్ 7 నుంచి బజ్ చేయాలంటూ ఆఫర్ వస్తే వదిలేసుకున్నాడట..ఐతే బిగ్ బాస్ బజ్ ని గీతూ రాయల్ నిర్వహించిన విషయం తెలిసిందే. ఐతే ఆదిరెడ్డి ఆ ఆఫర్ ని ఎందుకు వదులుకున్నాడో ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు. "ఐతే బిగ్ బాస్ బజ్ ఆఫర్ డైరెక్ట్ గా రాలేదు ఇన్ డైరెక్ట్ గా వచ్చింది.
నేను ఒప్పుకోను అనే విషయం టీమ్ వాళ్లకు కూడా తెలుసు. బిగ్ బాస్ సీజన్ 6 లో హౌస్ లోకి వెళ్ళాక రివ్యూస్ చేయలేదు. ఇప్పుడు బిగ్ బాస్ బజ్ చేస్తే రెండేళ్ల పాటు నా ఛానెల్ లో రివ్యూస్ చేయకూడదు. రెండేళ్లు చేయకపోతే ఛానల్ ఎత్తిపోతుంది. నాకు రివ్యూస్ ఇష్టం అది చేస్తేనే నేను సక్సెస్ అవుతానని నాకు తెలుసు. అందుకే అదే చేస్తాను. ఒకవేళ బిగ్ బాస్ బజ్ క్లిక్ కాకపొతే నాకు ఇటు అటు పోతుంది. వాళ్ళు ఇచ్చిన ప్రశ్నలు బజ్ లో అడిగి నేను నెగటివ్ ఐతే మొత్తానికే నాశనమవుతుంది. నా ఫామిలీ మళ్ళీ రోడ్డున పడుతుంది. నాకు ఆ సిట్యుయేషన్ అంటే భయం అందుకే జాగ్రత్తగా నా లైఫ్ ని ప్లాన్ చేసుకున్న. బిగ్ బాస్ బజ్ కి తక్కువ రెమ్యూనరేషన్ ఇస్తారు అదే నేను రివ్యూస్ చేసుకుంటే అంతకంటే ఎక్కువ డబ్బులొస్తాయి. నాకు జగన్ అన్న రాజశేఖర్ రెడ్డి గారన్నా ఇస్తాం..చదువుకోలేని పరిస్థితిలో నాకు ఫీజ్ రీయింబర్సుమెంట్ ఆయన వల్ల వచ్చిందనే గ్రాటిట్యూడ్ ఉంది. అలాగే లాస్ట్ ఇయర్ చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజుకు కూడా ఆయనకు ట్విట్టర్ లో విషెస్ చెప్పా ఆయన రిప్లై కూడా ఇచ్చారు. దాన్ని మా ఊరిలో పత్రికలో కూడా పబ్లిష్ చేశారు." అని చెప్పాడు ఆదిరెడ్డి.
![]() |
![]() |