![]() |
![]() |

సలార్ సినిమాతో ప్రభాస్ ఇండియా వైడ్ గా రికార్డు కలెక్షన్స్ ని సృష్టించి తెలుగు వాడి కీర్తిని పెంచడమే కాదు ఇప్పుడు తను నటించబోయే సినిమాల దర్శకులకి కూడా కీర్తిని తెచ్చిపెడుతున్నాడు. తాజాగా ప్రభాస్ కొత్త చిత్రం కల్కి 2898 a .d దర్శకుడుకి ఒక అరుదైన గౌరవం దక్కింది.
మహారాష్ట్రలోని బాంబే ఐఐటి లో నిర్వహించే టెక్ ఫస్ట్ కి కల్కి దర్శకుడు నాగ్ అశ్విన్ ప్రత్యేక అతిధిగా హాజరు కానున్నాడు. రేపు మధ్యాహ్నం 2 గంటలకి ఈ కార్యక్రమం జరగనుంది. ఇప్పుడు సోషల్ మీడియాలో వస్తున్న ఈ వార్తలపై ప్రభాస్ ఫ్యాన్స్ అయితే చాలా జోష్ లో ఉన్నారు. ఎందుకంటే ప్రభాస్ ఇప్పుడు పాన్ ఇండియా హీరో కాబట్టి బాంబే ఐఐటి లో కూడా ఖచ్చితంగా ప్రభాస్ ఫ్యాన్స్ భారీ సంఖ్యలోనే ఉంటారు. కాబట్టి దర్శకుడు నాగ్ అశ్విన్ ని కల్కి సినిమా గురించి అడుగుతారని ఆ విధంగా కల్కి అప్ డేట్స్ తమకి తెలుస్తాయని ఆనందంలో ఫ్యాన్స్ ఉన్నారు.

వైజయంతి మూవీస్ బ్యానర్ పై అశ్వనీదత్ నిర్మిస్తున్న కల్కి చిత్రంలో ప్రభాస్ సరసన దీపికా పదుకునే హీరోయిన్ గా చేస్తుండగా ఇండియన్ సినిమా గర్వించే హీరోలు అమితాబ్ బచ్చన్ ,కమల్ హాసన్ లు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. 2024 లో విడుదల అయ్యే కల్కి 2898 a .d సుమారు 600 కోట్ల బడ్జట్ తో రూపొందుతుంది.
![]() |
![]() |