![]() |
![]() |

విభిన్న చిత్రాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నందమూరి కళ్యాణ్ రామ్ మరో విభిన్న చిత్రంతో అలరించడానికి సిద్ధమయ్యాడు. అదే 'డెవిల్'. 'ది బ్రిటిష్ సీక్రెట్ ఏజెంట్' అనేది ట్యాగ్ లైన్. అభిషేక్ పిక్చర్స్ బ్యానర్ పై రూపొందిన ఈ సినిమాకి నిర్మాత, దర్శకుడు అభిషేక్ నామా. రేపు(డిసెంబర్ 29) విడుదల కానున్న ఈ మిస్టరీ థ్రిల్లర్ పై మంచి అంచనాలే ఉన్నాయి. ముఖ్యంగా ట్రైలర్ ఆకట్టుకోవడంతో ఈ చిత్రంపై ప్రేక్షకుల దృష్టి పడింది. థియేట్రికల్ బిజినెస్ కూడా బాగానే జరిగింది.
'డెవిల్' సినిమా రూ.20 కోట్లకు పైగా థియేట్రికల్ బిజినెస్ చేసింది. నైజాంలో రూ.5.50 కోట్లు, సీడెడ్ లో రూ.3 కోట్లు, ఆంధ్రాలో రూ.8 కోట్ల బిజినెస్ చేసిన ఈ మూవీ.. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో కలిపి రూ.16.50 కోట్ల బిజినెస్ జరుపుకుంది. ఇక కర్ణాటక+రెస్టాఫ్ ఇండియా రూ.1.60 కోట్లు, ఓవర్సీస్ రూ.2 కోట్లు కలిపి.. వరల్డ్ వైడ్ గా రూ.20.10 కోట్ల బిజినెస్ చేసినట్లు సమాచారం. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ సాధించాలంటే రూ.21 కోట్ల షేర్ రాబట్టాల్సి ఉంది.
హిట్ టాక్ వస్తే కళ్యాణ్ రామ్ కి ఇది పెద్ద టార్గెట్ కాదు. ఆయన కెరీర్ బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన 'బింబిసార' రూ.16 కోట్ల బిజినెస్ చేయగా, రూ.38 కోట్ల షేర్ రాబట్టి బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఇప్పుడు 'డెవిల్' కూడా అదే బాటలో పయనిస్తుందేమో చూడాలి.
![]() |
![]() |