![]() |
![]() |

స్వతహాగా తెలుగు వాడైన విశాల్ తమిళంలో ఉన్న స్టార్ హీరోల్లో ఒకడు. ఆయనకి తమిళనాడులో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఆయన సినిమాలు రిలీజ్ అయ్యాయంటే మాస్ ప్రేక్షకులకి పండగే. అలాగే ఆయన నటించిన సినిమాలన్ని కూడా తమిళంతో పాటు తెలుగులో కూడా విడుదల అయ్యి మంచి కలెక్షన్స్ ని సాధిస్తాయి. తాజాగా న్యూయార్క్ లో ఉన్న విశాల్ అక్కడ కెమెరాలకి చిక్కకుండా పరుగెత్తడం ఇప్పుడు సంచలనం సృష్టిస్తుంది.
విశాల్ క్రిస్మస్ సందర్భంగా న్యూయార్క్ వెళ్ళాడు. అక్కడ న్యూయార్క్ వీధుల్లో ఒక అమ్మాయి భుజం మీద చేయి వేసి విశాల్ వెళ్తుంటే అక్కడ ఉన్న కొంత మంది విశాల్ ని గుర్తుపట్టి విశాల్ అని పిలవగానే ఒక్క సారిగా తన ముఖాన్ని షర్ట్ తో కప్పుకొని అక్కడనుంచి ఆ అమ్మాయిని తీసుకొని పరుగెత్తుకుంటు వెళ్ళిపోయాడు. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే ఆ అమ్మాయి ముఖం కూడా ఎవరికీ కనపడకుండా విశాల్ జాగ్రత్తపడ్డాడు. దీంతో ఈ న్యూస్ చూసిన వాళ్ళందరు విశాల్ ప్రేమలో ఉన్నాడని అనుకుంటున్నారు. పైగా ఆ అమ్మాయి ఎవరయ్యుంటుందంటు ఎవరికీ తోచిన విధంగా వాళ్ళు ఆలోచిస్తున్నారు.
విశాల్ అభిమానులు మాత్రం ఇప్పటికే తమ అభిమాన కధానాయకుడి పెళ్లి రెండు సార్లు వాయిదా పడిన నేపథ్యంలో తను ప్రేమించిన అమ్మాయితో విశాల్ పెళ్లి జరుగుతుందని ఆనంద పడ్డారు. కానీ వాళ్ళ ఆనందం నిలవడానికి ఎంత సేపో పట్టలేదు. ఎందుకంటే విశాల్ అలా ఒక అమ్మాయితో కలిసి పరుగెత్తడం అనేది క్రిస్మస్ సందర్భంగా తన బంధువులతో కలిసి విశాల్ చేసిన ఒక ఫ్రాంక్ వీడియో. ఈ విషయాన్ని స్వయంగా విశాలే చెప్పి అందరి ఊహాగానాలకు చెక్ పెట్టాడు.
![]() |
![]() |