![]() |
![]() |

మాస్ మహారాజా కెరీర్ లో ఆల్ టైం ఎంటర్టైనర్స్ లో 'వెంకీ' సినిమా ఒకటి. శ్రీను వైట్ల దర్శకత్వంలో లక్ష్మి ప్రొడక్షన్స్ నిర్మించిన ఈ చిత్రం 2004 మార్చి 26న విడుదలై, ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ఈ సినిమాలో కామెడీ సన్నివేశాలకు, అందునా ట్రైన్ ఎపిసోడ్ కి ఎందరో అభిమానులున్నారు. సోషల్ మీడియాలో మీమ్స్ గా సైతం ఈ సినిమా టెంప్లేట్స్ ఎక్కువగా కనిపిస్తాయి. అంతలా ప్రేక్షకుల ఫేవరెట్ కామెడీ ఫిల్మ్ గా నిలిచిన వెంకీ.. దాదాపు 20 ఏళ్లకు మళ్ళీ థియేటర్లలో అలరించడానికి సిద్ధమైంది.
వెంకీ సినిమా డిసెంబర్ 30న రీరిలీజ్ అవుతోంది. ఆ మధ్య పలు తెలుగు సినిమాలు రీరిలీజ్ అయ్యి మంచి వసూళ్లతో సత్తా చాటాయి. అయితే ఇటీవల రీరిలీజ్ సినిమాలకు అంతగా రెస్పాన్స్ లేకపోవడంతో ఇక ఆ ట్రెండ్ కి బ్రేక్ పడినట్లే అనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. కానీ ఇప్పుడు వెంకీ మళ్ళీ ఆ ట్రెండ్ కి ఊపిరి పోసేలా ఉంది. ఈ మూవీ బుకింగ్స్ కి మంచి రెస్పాన్స్ వస్తోంది. హైదరాబాద్ లో దాదాపు 20 షోల బుకింగ్స్ ఓపెన్ కాగా, ఇప్పుటికే మెజారిటీ షోలు ఫుల్ అయ్యాయి. ఈ రెస్పాన్స్ చూస్తుంటే మరి కొన్ని షోలు యాడ్ అయ్యేలా ఉన్నాయి.
ప్రస్తుతం థియేటర్లలో 'సలార్' హవా కొనసాగుతోంది. డిసెంబర్ 29న 'డెవిల్', 'బబుల్ గమ్' వంటి సినిమాలు విడుదల కానున్నాయి. అయినప్పటికి వీటి నడుమ రీరిలీజ్ అవుతున్న వెంకీ బుకింగ్స్ కి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే.. ప్రేక్షకుల్లో ఆ మూవీ పట్ల ఉన్న క్రేజ్ ని అర్థంచేసుకోవచ్చు.
![]() |
![]() |