![]() |
![]() |

తెలుగు సినిమా బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ ల వర్షంలో తడిసి ముద్దవ్వడానికి కౌంట్ డౌన్ స్టార్ట్ అయ్యింది.ఇంకెంత మహా అయితే రెండు వారాలు.ఇంక ఆ తర్వాత మహేష్ సునామి ప్రారంభం కాబోతుంది. అంటే జనవరి 12 నుంచి సూపర్ స్టార్ మహేష్ బాబు వన్ మాన్ షో గుంటూరు కారంతో రెండు తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్లన్నీ కళకళలాడబోతున్నాయి. తాజాగా ఇప్పుడు గుంటూరు కారం నుంచి వస్తున్న ఒక న్యూస్ మహేష్ ఫ్యాన్స్ లో జోష్ ని తెస్తుంది.
గుంటూరు కారం మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ అత్యంత భారీ ఎత్తున హైదరాబాద్ లో జరగనుంది. అలాగే మూవీ రిలీజ్ అనంతరం జరిగే సక్సెస్ మీట్ గుంటూరులో జరగనుంది. ఈ మేరకు చిత్ర నిర్మాతల నుంచి అధికార ప్రకటన అతి త్వరలోనే రానుంది. ఇప్పుడు ఈ వార్తలతో రెండు తెలుగు రాష్ట్రాల్లోని మహేష్ అభిమానులు ఫుల్ హ్యాపీ మోడ్ లో ఉన్నారు.

హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న గుంటూరుకారం లో మహేష్ సరసన శ్రీలీల మీనాక్షి చౌదరిలు హీరోయిన్లుగా చేస్తుండగా ప్రకాష్ రాజ్, జగపతిబాబు, రమ్యకృష్ణ, రఘుబాబు, సునీల్, బ్రహ్మానందం, తదితరులు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.
![]() |
![]() |