![]() |
![]() |
విజయ్ ఆంటోని కొత్త సినిమా వస్తోందంటే ఆడియన్స్ ఎలర్ట్ అవుతారు. ఎందుకంటే అతను చేసే ప్రతి సినిమా విభిన్నంగా ఉంటూ ప్రేక్షకుల్ని ఆలోచింపజేస్తుంది. అతనికి తెలుగులో ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఎక్కువే. హీరోగా, దర్శకుడిగా, మ్యూజిక్ డైరెక్టర్‌గా, ఎడిటర్‌గా తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకున్న విజయ్ ఇప్పుడు ‘హిట్లర్’ అనే కొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ సినిమాకి సంబంధించిన టీజర్‌ను ఇటీవల విడుదల చేసింది చిత్ర యూనిట్.
ఎన్నికలు, రాజకీయపార్టీల నేపథ్యంలో ఈ సినిమా సాగుతుంది. డబ్బుతో సాగే రాజకీయాలు.. వాటి ప్రభావం ప్రజలపై ఎలా ఉంటుంది అనే పాయింట్ తోనే ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఈ చిత్రాన్ని ధన డైరెక్ట్ చేస్తున్నారు. విజయ్ ఆంటోనీ సరసన రియా సుమన్ నటిస్తోంది. ఈ సినిమాలో ప్రముఖ దర్శకుడు గౌతమ్ మీనన్ ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. టీజర్‌లో ఆకట్టుకున్న మొదటి అంశం మ్యూజిక్. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ చాలా కొత్తగా ఉంది. వివేక్- మెర్విన్ ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు. రెండో అంశం కెమెరా పనితనం. ఫ్రేమ్ చాలా కొత్తగా అనిపిస్తోంది. నవీన్ కుమార్ అద్భుతమైన సినిమాటోగ్రఫీని అందించారు. టీజర్ స్టార్టింగ్‌లో ఒక డైలాగ్ ఉంటుంది. ‘మనం యుద్ధానికి వాడబోయే ఆయుధాన్ని నిర్ణయించేది మన శత్రువే’ ఈ మాటతో సినిమాలో పదునైన, సమాజాన్ని, రాజకీయ పార్టీలను ప్రశ్నించే రీతిలో డైలాగ్స్ ఉంటాయనే ఎక్స్ పెక్ట్ చేయచ్చు. ఈ సినిమా తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో విడుదల కాబోతోంది.
![]() |
![]() |