![]() |
![]() |
ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్‌లో వచ్చిన జనతా గ్యారేజ్ ఎంతటి విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. మళ్లీ వీరిద్దరి కాంబినేషన్‌లో రూపొందుతున్న సినిమా ‘దేవర’. అలిండియా స్టార్ శ్రీదేవి కూతురు జాన్వి కపూర్ ఈ సినిమాతో హీరోయిన్‌గా తెలుగులో ఎంట్రీ ఇస్తోంది. అంతేకాదు, బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీఖాన్ విలన్‌గా నటిస్తున్నాడు. ఇన్ని ప్రత్యేకతలు ఉన్న ఈ సినిమా కథ, కథనం, బ్యాక్‌డ్రాప్ విషయంలో కూడా ప్రత్యేకత ఉండాలన్న ఉద్దేశంతో ప్రేక్షకుల్ని ఓ కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్ళే ప్రయత్నం చేస్తున్నాడు కొరటాల శివ. ఇప్పటివరకు శివ చెయ్యని ఒక డిఫరెంట్ కాన్సెప్ట్‌తో ‘దేవర’ చేస్తున్నాడు. అంతేకాదు, ఈ సినిమాకి రెండో భాగం కూడా ఉంటుందని కొరటాల శివ ప్రకటించిన విషయం తెలిసిందే.
ఈ సినిమా షూటింగ్ మేజర్ పార్ట్ కంప్లీట్ అయిపోయిందట. గ్యాప్ లేకుండా షూటింగ్ చేయడంలో సినిమా ఇప్పుడు ఈ దశలో ఉంది. ఫస్ట్‌టైమ్ ఈ సినిమా షూటింగ్‌కి ఎక్కువ గ్యాప్ తీసుకోబోతున్నారని తెలుస్తోంది. ఇంతకుముందు వారానికి మించి ఎప్పుడు గ్యాప్ ఇవ్వని కొరటాల ఈసారి మాత్రం కొత్త సంవత్సరాన్ని అందరూ హ్యాపీగా సెలబ్రేట్ చేసుకునేందుకు వీలుగా ఎక్కువ రోజులు యూనిట్‌కి సెలవు ఇవ్వబోతున్నాడు.
హాలీడేస్ లభించడంతో ఎన్టీఆర్ తన ఫ్యామిలీతో కలిసి వెకేషన్‌కి వెళ్లేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు. న్యూ ఇయర్‌ను కూడా అక్కడ జరుపుకోవాలని డిసైడ్ అయ్యారట. నాన్‌స్టాప్ షూటింగ్స్‌తో యూనిట్ సభ్యులు బాగా అలసిపోయారని, అందుకే వారికి కొంత రిలీఫ్‌ని ఇచ్చేందుకు ఈ గ్యాప్ తీసుకుంటున్నారని తెలుస్తోంది. జనవరిలో ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ అవుతుందట. ఈ సినిమా పూర్తయిన వెంటనే ‘వార్2’ షూటింగ్‌లో పాల్గొనేందుకు ఎన్టీఆర్ సిద్ధమవుతాడు. ఇప్పటికే ‘వార్2’ షూటింగ్ స్టార్ట్ అయింది. ప్రస్తుతం హృతిక్ రోషన్‌కి సంబంధించిన సీన్స్‌ను షూట్ చేస్తున్నారు. ఈ సినిమాలో ఎన్టీఆర్ నెగెటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ చెయ్యబోతున్నాడు.
![]() |
![]() |