![]() |
![]() |

నందమూరి నట సింహం బాలకృష జోరు ఇప్పుడప్పుడే తగ్గేలా లేదు. అఖండ,వీర సింహ రెడ్డి, భగవంత్ కేసరి ఇలా బ్యాక్ టు బ్యాక్ హ్యాట్రిక్ హిట్స్ తో తెలుగు సినిమా పరిశ్రమ మీద తన కున్న అజమాయిషీ ని కొనసాగిస్తు వస్తున్నారు. ఆయన నటించిన సినిమా వస్తుందంటే చాలు ఇక ఆ సినిమా హిట్ అనే ఒక అభిప్రాయం ప్రేక్షకుల్లో కూడా చాలా బలంగా నాటుకు పోయింది. తాజాగా ఆయన కొత్త చిత్రం ఇటీవలే ప్రారంభం అయ్యి షూటింగ్ ని కూడా జరుపుకుంటుంది. ఇప్పుడు ఆ సినిమాకి సంబంధించిన క్రేజీ న్యూస్ ఒకటి ఫిలింసర్కిల్స్ లో హల్ చల్ చేస్తుంది.
బాలకృష్ణ నటిస్తున్న తాజా చిత్రానికి కేఎస్ రవీంద్ర (బాబీ ) దర్శకుడు. బాలకృష్ణ కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జట్ తో రూపొందుతున్న ఈ చిత్రానికి సంబంధించి ఒక ఐటెం సాంగ్ ని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఇప్పుడు ఆ సాంగ్ కి మిల్క్ బ్యూటీ తమన్నాని తీసుకోవాలని భావించి ఆమెని సంప్రదించారు. తమన్నా కూడా ఆ గీతంలో నటించడానికి ఒప్పుకుంది. కానీ 2 కోట్లు డిమాండ్ చేస్తుందనే మాటలు వినిపిస్తున్నాయి. దాంతో శృతి హాసన్ తో అయినా ఆ సాంగ్ ని తెరక్కించాలనుకుంటున్నారు. కానీ చిత్ర యూనిట్ మొత్తం తమన్నా వైపే మొగ్గుచూపిస్తుంది. దీంతో తమన్నానే ఫైనల్ చేస్తున్నారనే మాటలు వినపడుతున్నాయి.

ఇప్పుడు బాలయ్య సినిమాలో తమన్నా ఐటెం సాంగ్ చేస్తుందనే వార్తలు వస్తున్న నేపథ్యంలో ఎన్నో సూపర్ డూపర్ హిట్ ఐటెం సాంగ్స్ లో నటించిన తమన్నా బాలయ్య తో వేసే స్టెప్స్ ఎలా ఉంటాయో అని అందరిలో ఆసక్తి నెలకొని ఉంది. అలాగే బాలయ్య తమన్నా తో వేసే స్టెప్ ల కోసం బాలయ్య ఫాన్స్ ఇప్పటినుంచే ఎదురుచూస్తుంటారనటంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. సితార ఎంటర్ టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ అండ్ సౌజన్యలు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. చిరంజీవితో వాల్తేరు వీరయ్య లాంటి సూపర్ డూపర్ హిట్ సినిమాకి దర్శకత్వాన్ని వహించిన బాబీ ఈ సినిమాకి దర్శకుడు కావడంతో ఇప్పుడు బాలయ్య సినిమా మీద భారీ అంచనాలే ఉన్నాయి.
![]() |
![]() |