![]() |
![]() |

ఇంకో మూడు రోజుల్లో ప్రభాస్ సలార్ అనే సినిమాతో ప్రపంచ వ్యాప్తంగా తన సత్తా చాటడానికి వస్తున్నాడు.ప్రభాస్ నుంచి అభిమానులు ఎలాంటి సినిమా అయితే రావాలని కోరుకున్నారో అలాంటి సినిమానే వస్తుండటంతో దేశ వ్యాప్తంగా ఉన్న ప్రభాస్ అభిమానుల్లో సలార్ సందడి మొదలయ్యింది. అంతకంటే ఒక రోజు ముందు అంటే సలార్ కంటే ఒక రోజు ముందు బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ డంకీ తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. రెండు సినిమాలు పాన్ ఇండియా రేంజ్ లో విడుదల అవుతున్నాయి. ఈ క్రమంలో సలార్ కి జరిగిన అన్యాయం ప్రభాస్ ఫ్యాన్స్ ని బాధపడేలా చేస్తుంది.
బాహుబలి దగ్గరనుంచి ప్రభాస్ కి నార్త్ లో కూడా ఇంచుమించు మన తెలుగులో ఉన్నట్టుగానే క్రేజ్ ఉంది.ప్రభాస్ గత చిత్రాలు తెలుగులో అంతగా ఆడకపోయినా కూడా నార్త్ లో మాత్రం బాగానే ఆడాయి. అలాగే రికార్డు స్థాయి కలెక్షన్స్ ని కూడా సాధించాయి.అలాంటిది ఇప్పుడు సలార్ కి నార్త్ లో సింగల్ స్క్రీన్ థియేటర్స్ ఎక్కువగా ఇవ్వటం లేదు. ఆ థియేటర్లన్నీఎక్కువగా డంకీ కి ఇచ్చేస్తున్నారు. రాజ్ కుమార్ హిరానీ దర్శకత్వంలో వస్తున్న డంకీ సినిమా ప్యూర్ A క్లాస్ సినిమా కనుక డంకీ కి మల్టి ప్లెక్స్ లలో క్రేజ్ ఉంటుంది. సలార్ మాస్ సినిమా కాబట్టి సింగల్ స్క్రీన్ లో ఎక్కువ ఆదరణ ఉంటుంది. కానీ ఇప్పుడు సింగల్ స్క్రీన్స్ కూడా ఎక్కువుగా డంకీ మూవీ కే కేటాయిస్తుండటంతో ప్రభాస్ కి కావాలనే అన్యాయం చేస్తున్నారని ఫ్యాన్స్ మండిపడుతున్నారు.
ప్రభాస్ ఫ్యాన్స్ కొంత మంది మాత్రం సలార్ కి నార్త్ లో అన్యాయం జరిగితే మరి డంకీ కి కూడా సౌత్ లో అలాగే అన్యాయం జరిగే ఛాన్స్ ఉంటుందనే విషయాన్ని డంకీ మేకర్స్ తెలుసుకోవాలని ప్రభాస్ ఫ్యాన్స్ అంటున్నారు. ఎవరు ఎన్ని చేసినా సలార్ సినిమా పక్కా హిట్ గా నిలిచి ఇండియా వ్యాప్తంగా రికార్డులు సృష్టించడం ఖాయం అని కూడా ప్రభాస్ ఫ్యాన్స్ అంటున్నారు. ఏది ఏమైనా ఇప్పుడుడంకీ కి సలార్ కి బాలీవుడ్ లో పోటీ తప్పేలా లేదు.
![]() |
![]() |