![]() |
![]() |
.webp)
కొన్ని రోజుల క్రితం యానిమల్ ఫీవర్ తో ఊగిన ఇండియా ఇప్పుడు సలార్ మానియాతో ఊగిపోతోంది. డిసెంబర్ 22 న విడుదల అవుతున్న సలార్ కోసం ప్రభాస్ ఫ్యాన్స్ ఇప్పటినుంచే సలార్ టికెట్స్ ఎలా సంపాదించాలా అని ప్లాన్స్ వేసుకుంటున్నారు. ఆన్ లైన్ లో టికెట్స్ దొరకడం కష్టమని భావించి తమకి తెలిసిన విఐపి ల చేత టిక్కెట్ల కోసం థియేటర్స్ కి ఫోన్ లు చేయిస్తున్నారు. ఒక రకంగా చెప్పాలంటే ఇప్పుడు సలార్ టికెట్ లకి మంచి గిరాకీ ఉంది. మరిప్పుడు ఇంత గిరాకీలో సలార్ ఫస్ట్ టికెట్ ని దక్కించుకున్న వ్యక్తి ఎవరో మీకు తెలుసా?
సలార్ ఫస్ట్ డే ఫస్ట్ షో టికెట్ ని దర్శక ధీరుడు రాజమౌళి సంపాదించాడు .సలార్ విడుదల రోజైన డిసెంబర్ 22 న హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్డులో ఉన్న సంధ్య 70 ఏంఏం లో ఉదయం ఏడు గంటల షో ని రాజమౌళి చూడబోతున్నాడు నిన్న జరిగిన సలార్ టికెట్ వేడుక ఫంక్షన్స్ లో ప్రభాస్, పృథ్వీ రాజ్ సుకుమారన్, ప్రశాంత్ నీల్ లు సలార్ టికెట్ ని ఆవిష్కరించి రాజమౌళికి అందచేశారు.ఇప్పుడు ఇండియా మొత్తం మీద రాజమౌళి నే సలార్ టికెట్ అందుకున్న మొట్ట మొదటి వ్యక్తిగా రికార్డు సృష్టించాడు.

అలాగే రాజమౌళికి ప్రభాస్ అంటే ఎంత అభిమానమో అందరికి తెలిసిన విషయమే. చాలా సందర్భాల్లో ఆ విషయాన్ని రాజమౌళినే అందరికి తెలియచేసాడు. అలాగే మరికొన్ని రోజుల్లో సలార్ ప్రమోషన్స్ లో భాగంగా రాజమౌళి ప్రభాస్ ఇంటర్వ్యూ కూడా ప్రారంభం కానుంది. రాజమౌళి,ప్రభాస్ కాంబినేషన్ లో ఛత్రపతి, బహుబాలి 1 ,2 లు వచ్చి ఎంతటి ఘన విజయాన్ని సాధించాయో అందరికి తెలిసిన విషయమే.
![]() |
![]() |