![]() |
![]() |

ప్రభాస్ హీరోగా డిసెంబర్ 22 న విడుదల అవుతున్న ప్యూర్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ సలార్. పాన్ ఇండియా లెవెల్లో విడుదల కాబోతున్న ఈ మూవీ కోసం తెలుగు ప్రేక్షకులు ఎంతగా ఎదురుచూస్తున్నారో భారతీయ సినీ ప్రేక్షకులు కూడా అంతే ఇదితో ఎదురుచూస్తున్నారు. మూవీ రిలీజ్ అయ్యాక సలార్ సృష్టించే రికార్డులు ఏ విధంగా ఉంటాయో అని ప్రభాస్ ఫ్యాన్స్ అంచనా వేస్తుంటే ఇప్పుడు సలార్ విడుదల కి ముందే ఒక రికార్డు ని క్రియేట్ చేసింది.

ప్రముఖ ఆన్ లైన్ టికెట్ బుకింగ్ సంస్థ అయినటువంటి బుక్ మై షో లో సలార్ 1మిలియన్ ఇంట్రెస్ట్ లను సొంతం చేసుకుంది. బుక్ మై షో యాజమాన్యం సలార్ మూవీ చూడాలని ఇంట్రెస్ట్ ఉందా అని తమ యాప్ లో ఉంచింది.దీంతో సలార్ టికెట్ కోసం ఆ యాప్ లోకి వెళ్లిన వాళ్లంతా మూవీ చూడాలని ఉందని చెప్పారు. ఇలా 1మిలియన్ మంది సినిమా చూడాలని చెప్పారు.ఇప్పుడు ఈ న్యూస్ ని సలార్ టీమ్ ఒక పోస్టర్ ద్వారా అనౌన్స్ చేసింది.దీంతో ప్రభాస్ ఫాన్స్ ఆనందానికి అవధులు లేవు. ఇటీవలే వచ్చిన ప్రభాస్ ఆదిపురుష్ కూడా బుక్ మై షోలో 1 మిలియన్ కి పైగా ఇంట్రెస్ట్ లను సొంతం చేసుకుంది.
![]() |
![]() |