![]() |
![]() |

అందాల రాక్షసి తో తెలుగు సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి ఆ సినిమాలో నాన్న నాకు త్వరగా పెళ్లి చెయ్యండనే ఒకే ఒక్క డైలాగ్ తో ప్రేక్షకుల మనసులో చిరస్థాయిగా నిలిచిపోయిన నటి లావణ్య త్రిపాఠి. ఆ తర్వాత కూడా ఎన్నో సినిమాల్లో నటించి తన కంటు ప్రత్యేకమైన అభిమానుల్ని కూడా ఆమె సంపాదించింది. కొన్ని రోజుల క్రితం ఆమె మెగా హీరో వరుణ్ తేజ్ ని వివాహం చేసుకున్న విషయం అందరికి తెలిసిందే. ఈ రోజు లావణ్య జీవితంలో ఒక మరుపురాని రోజుగా మిగలబోతుంది.
ఈ రోజు లావణ్య పుట్టిన రోజు.వరుణ్ తో పెళ్లి అయ్యాక లావణ్య జరుపుకుంటున్న మొట్ట మొదటి పుట్టిన రోజు కూడా ఇదే. డిసెంబర్ 15 1990 వ సంవత్సరంలో లావణ్య జన్మించింది. అంటే ఆమె ఈ రోజుతో 33 సంవత్సరాలని పూర్తి చేసుకొని 34 వ సంవత్సరంలోకి అడుగుపెడుతుంది. ప్రస్తుతం వరుణ్ లావణ్య ఇద్దరు వేరే దేశానికి చెందిన ఒక మంచు ప్రదేశంలో ఉన్నారు.తన భార్య బర్త్ డే ని ఆ ప్రదేశంలో జరపటం కోసమే వరుణ్ లావణ్య ని అక్కడకి తీసుకెళ్లారు.
.webp)
ఇక పోతే లావణ్య బర్త్ డే ని పురస్కరించుకొని మెగా కుటుంబ సభ్యులందరు ట్విట్టర్ ద్వారా ఆమెకి చాలా వెరైటీగా శుభాకాంక్షలు చెప్పారు. నాగబాబు తన కోడలి మీద ప్రేమను కురిపిస్తు నాకెంతో ఇష్టమైన నా ప్రియమైన లావణ్యకు ఈ ప్రత్యేకమైన రోజు ప్రత్యేక శుభాకాంక్షలు. అలాగే నువ్వు ఎప్పుడు సంతోషంగా ఉంటు ప్రేమతో విజయాలు అందుకుంటూ నీ జీవితాన్ని గడపాలని చెప్పాడు. నిహారిక లావణ్యకి బర్త్ డే విషెస్ చెప్తు నీ సహనం, ప్రేమ, సంతోషం, నీ జోకులు ఇంకా మా మీద ప్రయోగించాలి త్వరగా రా వదిన లవ్యూ వదిన అంటూ పోస్ట్ వేసింది. ఇక సాయిధరమ్ తేజ్ అయితే చాలా వెరైటీగా విషెస్ చెప్పాడు. అరె కౌన్ హే రే తూ ఓ ఆప్ ఓకే ఓకే హ్యాపీ బర్త్ డే లావణ్య.. నువ్వు చల్లగా ఉండు మా వాడ్ని చల్లగా ఉంచు అంటూ ఫన్నీగా విషెస్ చెప్పాడు. ఇప్పుడు సాయి ధరమ్ తేజ్ అలా విషెస్ చెప్పడంతో బర్త్ డే విషెస్ ని కూడా సరదాగా చెప్పడంలో తేజ్ తర్వాతే ఎవరైనా అని మెగా ఫ్యాన్స్ అనుకుంటున్నారు అలాగే వరుణ్ తేజ్ కూడా హ్యాపీ బర్త్ డే బేబి.. నా ప్రపంచాన్ని ఇంకా వెలుగులతో నింపినందుకు థాంక్స్ ,లవ్యూ అంటూ పోస్ట్ వేశాడు.
![]() |
![]() |