![]() |
![]() |

స్టార్ హీరోయిన్ అనుష్క ,యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి ల కలయికలో వచ్చిన మూవీ మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి. సెప్టెంబర్ 7 న తెలుగుతో పాటు తమిళ,మలయాళ, కన్నడ భాషల్లో ఒకే సారి రిలీజ్ అయిన ఈ మూవీ ప్రేక్షకుల నుంచి మంచి స్పందననే రాబట్టుకుంది. ఇప్పుడు ఈ మూవీకి సంబంధించిన తాజా న్యూస్ ఒకటి మూవీ లవర్స్ లో జోష్ ని నింపుతుంది.
డిసెంబర్ 24 న సాయంత్రం 6:00 గంటలకి మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి జీ తెలుగులో ప్రసారం కానుంది. బిగ్గెస్ట్ వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా బుల్లితెర ప్రేక్షకులను అలరించడానికి అనుష్క నవీన్ లు సిద్దమవ్వడంతో ఇప్పుడు ఈ వార్త సినిమా అభిమానులలో పండుగ వాతావరణాన్ని తీసుకొచ్చింది. యూవీ క్రియేషన్స్ పతాకంపై వంశీ కృష్ణ, ప్రమోద్ లు నిర్మించిన ఈ మూవీకి మహేష్ బాబు.పి దర్శకత్వం వహించగా గోపి సుందర్ సంగీతాన్ని అందించాడు.

యుఎస్ లో అంతర్జాతీయంగా పేరు పొందిన ఒక హోటల్ లో చెఫ్ గా పనిచేసే మిస్ శెట్టి తన తల్లి చివరి కోరిక మేరకు ఇండియా వచ్చి తన ప్రమేయం లేకుండా, పెళ్లి చేసుకోకుండా తల్లి కావాలని అనుకుంటుంది. ఈ క్రమంలో స్పెరమ్ డోనర్ కోసం మిస్టర్ పోలిశెట్టి తో క్లోజ్ గా ఉంటుంది. మిస్టర్ పోలిశెట్టి మాత్రం ఆమెది లవ్ గా భావించి ప్రేమిస్తాడు. కానీ చివరకి అసలు విషయం తెలిసిన మిస్ శెట్టి ఏం చేసాడు? మిస్టర్ పోలిశెట్టి కోరిక నెరవేరిందా అనేదే ఈ చిత్ర కథ..సినిమా ఆద్యంతం చాలా ఎంటర్ టైన్మెంట్ గా ఉంటుంది.
![]() |
![]() |