![]() |
![]() |
టాలీవుడ్ డైరెక్టర్స్‌లో త్రివిక్రమ్‌ది ప్రత్యేకస్థానం. యాక్షన్, ఫ్యాక్షన్, ఫ్యామిలీ, సెంటిమెంట్.. ఇలా అన్ని తరహా కథలతో సినిమాలను రూపొందించే త్రివిక్రమ్ హాస్యానికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారని అతని సినిమాలు చూస్తే అర్థమవుతుంది. అందుకని త్రివిక్రమ్‌ని, అతని సినిమాలను ఇష్టపడని వారు ఉండరంటే అతిశయోక్తి కాదు. తన డైలాగులతో ప్రేక్షకుల్ని కట్టిపడేసే త్రివిక్రమ్‌కి ఈమధ్య ఓ లవ్ ప్రపోజల్ వెళ్లింది. బుల్లితెరపై యాంకరింగ్ చేస్తూనే సినిమాల్లో కూడా నటిస్తున్న భానుశ్రీ ఇటీవల త్రివిక్రమ్‌ని కలిసి ప్రపోజ్ చేసింది. దానికి త్రివిక్రమ్ కూడా పాజిటివ్‌గా రియాక్ట్ అయి ఆమె లవ్‌ను యాక్సెప్ట్ చేశాడు.
వివరాల్లోకి వెళితే.. ఇటీవల అల్లు అర్జున్ ఓ ఫుడ్ కంపెనీకి సంబంధించిన యాడ్ షూట్‌లో పాల్గొన్నాడు. ఈ యాడ్‌ను త్రివిక్రమ్ డైరెక్ట్ చేశారు. ఇందులో భానుశ్రీ కూడా నటించింది. ఆ సందర్భంలో ‘ఐ లవ్ యు సర్’ అంటూ భానుశ్రీ ప్రపోజ్ చేయగానే త్రివిక్రమ్ కూడా ‘ఐ లవ్ యు టూ’ అంటూ రిప్లై ఇచ్చాడు. ఆ తర్వాత త్రివిక్రమ్‌తో కలిసి ఫోటో కూడా దిగింది భానుశ్రీ. ఈ విషయాలన్నీ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తెలియజేసింది. అంతేకాదు, త్రివిక్రమ్‌తో దిగిన ఫోటోను కూడా సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇప్పుడు త్రివిక్రమ్ గురించి భానుశ్రీ చెప్పిన విషయాలకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. తనకు త్రివిక్రమ్ అంటే ఎంతో ఇష్టమని, అందుకే లవ్ ప్రపోజ్ చేశానని, దానికి త్రివిక్రమ్ కూడా పాజిటివ్‌గా స్పందించడంతో తన సంతోషానికి అవధుల్లేవని ఆ ఇంటర్వ్యూలో తెలియజేసింది భానుశ్రీ. తను రాజమౌళి వంటి పెద్ద డైరెక్టర్ల సినిమాల్లో నటించానని, ఇప్పటివరకు ఎవ్వరితోనూ ఫోటో దిగలేదని, త్రివిక్రమ్‌తోనే దిగానని ఈ సందర్భంలో వెల్లడిరచింది. ఇప్పటి వరకు దిగ్గజ డైరెక్టర్లతో పనిచేశాను కానీ ఎవరితో కూడా ఫొటో దిగలేదు. కేవలం త్రివిక్రమ్ తోనే దిగాను అంటూ అతడిపై ఉన్న ఇష్టాన్ని భానుశ్రీ తెలియజేసింది.
![]() |
![]() |