![]() |
![]() |
.webp)
భారతదేశ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న సినిమా సలార్.. కొన్ని రోజుల క్రితం సలార్ ప్రమోషన్స్ సరిగా జరగడం లేదనే డిసప్పాయింట్ లో ఉన్న ప్రభాస్ అభిమానులు ఇప్పుడు రోజు రోజుకి సలార్ ప్రమోషన్స్ లో వేగం పెరుగుతుండటంతో ఫుల్ జోష్ లో ఉన్నారు. ఇప్పుడు వాళ్లలో మరింత జోష్ ని నింపేలా సలార్ టికెట్ వేడుక జరిగింది. పైగా ప్రముఖ హిట్ చిత్రాల నిర్మాణ సంస్థ తెలంగాణ ఏరియా హక్కులని తీసుకోవడంతో ప్రభాస్ అభిమానుల ఆనందానికి అవధులు లేవు.
తెలుగు సినిమా ప్రంపంచంలో హీరోలకి దర్శకులకి, హీరోయిన్లకి ఎంత పేరు ఉందో మైత్రి మూవీ మేకర్స్ కి కూడా అంతే పేరు ఉంది. మైత్రి బ్యానర్ ని చూసి కూడా సినిమాకెళ్లే వాళ్ళు ఉన్నారని అనడంలో కూడా ఎలాంటి అతిశయోక్తి లేదు. ఇప్పుడు సలార్ నైజాం ఏరియా హక్కులని మైత్రి మూవీస్ వారు తీసుకున్నారు.డిసెంబర్ 22 న ప్రభాస్ సినీ కెరీర్ లోనే సలార్ నైజాంలో అత్యధిక థియేటర్లలో రిలీజ్ అవుతుంది. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని సలార్ టికెట్ వేడుక చాలా గ్రాండ్ గా జరిగింది.
ఈ వేడుకలో రెబల్ స్టార్ ప్రభాస్, దర్శక దిగ్గజం రాజమౌళి, ప్రముఖ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్, సలార్ చిత్ర దర్శకుడు ప్రశాంత్ నీల్, మైత్రి మూవీస్ అధినేత నవీన్ యెర్నేని తదితరులు పాల్గొని సలార్ టికెట్ ని విడుదల చేసారు.
అలాగే మరికొన్ని రోజుల్లో నైజాం ఏరియాలో బుకింగ్స్ కూడా ప్రారంభం కాబోతున్నాయి.ఇప్పుడు ఈ వార్తలతో ప్రభాస్ అభిమానుల్లో మరింత హుషారు వచ్చింది. పైగా మేకర్స్ విడుదల చేసిన టికెట్ హైదరాబాద్ లోని ప్రముఖ ప్రసిద్ధ సినీ క్షేత్రమైన సంధ్య 70 ఎంఎం కి సంబంధించిన ఉదయం 7 గంటల షో టికెట్ కావడంతో ఇక అభిమానుల ఆనందానికి అవధులు లేవు. మైత్రి మూవీస్ ప్రస్తుతం పవన్ కళ్యాణ్ తో ఉస్తాద్ భగత్ సింగ్ అనే సినిమాని తెరకెక్కిస్తోంది.
![]() |
![]() |