![]() |
![]() |

ఇటీవల ఓ మహిళ ఆత్మహత్య కేసులో 'పుష్ప' సినిమాలో కేశవ పాత్ర పోషించిన నటుడు జగదీష్ అరెస్ట్ అయ్యాడు. అది మరువక ముందే టాలీవుడ్ లో మరో ఘటన చోటు చేసుకుంది. అత్యాచారం కేసులో ప్రముఖ యూట్యూబర్, నటుడు చందు సాయి అరెస్ట్ అయ్యాడు.
'పక్కింటి కుర్రాడు', 'చందుగాడు' వంటి యూట్యూబ్ సిరీస్ లతో ఫేమస్ అయిన చందు సాయి.. పలు సినిమాల్లోనూ నటించాడు. అయితే తనని పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడంటూ ఓ యువతి ఇచ్చిన ఫిర్యాదుతో హైదరాబాద్ లోని నార్సింగి పోలీసులు అతడిని శుక్రవారం అరెస్ట్ చేశారు.
పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. పుట్టినరోజు వేడుకలకు రావాలని యువతిని పిలిచిన చందు ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. దీంతో తనని పెళ్లి చేసుకోవాలని ఆ యువతి కోరగా అప్పటి నుంచి చందు మొహం చాటేస్తున్నాడు. తాను మోసపోయానని గ్రహించిన యువతి పోలీసులను ఆశ్రయించింది. దీంతో పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు.. చందుని అదుపులోకి తీసుకున్నారు. అలాగే ఈ ఘటనలో చందు తల్లిదండ్రులతో పాటు, మరో ఇద్దరిపై కేసు నమోదైనట్లు సమాచారం.
![]() |
![]() |