![]() |
![]() |

రవితేజ నటించిన గత రెండు చిత్రాలు రావణాసుర ,టైగర్ నాగేశ్వరరావు ఆయన అభిమానులతో పాటు ప్రేక్షకులని కూడా ఎంతగానో నిరాశపరిచాయి. ఆ రెండు సినిమాల్లో రవితేజ సూపర్ గా నటించినా కూడా ఆ చిత్రాలు బాక్స్ ఆఫీస్ వద్ద మాత్రం రవితేజ స్టామిని నిరూపించలేకపోయాయి. ఇప్పుడు ఆయన తాజాగా ఈగల్ అనే సినిమాని చేస్తున్నాడు. ఈ చిత్రానికి సంబంధించిన ఒక ఫేక్ న్యూస్ కొన్ని రోజుల నుంచి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఇదంతా ఫేక్ న్యూస్ అంటూ చిత్ర నిర్మాణ సంస్థ తెలిపింది.
ఈగల్ సినిమా సంక్రాంతికి రావటం లేదని రవితేజ బయపడ్డాడేమో అంటు కొంత మంది పని గట్టుకొని మరి సోషల్ మీడియాలో స్ప్రెడ్ చేస్తున్నారు. ఇప్పుడు ఆ వార్తలకి ఈగల్ నిర్మాణ సంస్థ చెక్ పెడుతు ట్విటర్ వేదికగా జనవరి 13 న మా ఈగల్ గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నామని తెలిపింది. దీంతో రవితేజ అభిమానుల ఆనందానికి అవధులు లేవు. ఇక సంక్రాంతి సీజన్ కి ఎన్నో భారీ సినిమాలు వస్తున్నాయి. మహేష్ గుంటూరు కారం జనవరి 12 న , వెంకటేష్ సైంధవ్ 13 న నాగార్జున నా సామిరంగా కూడా సంక్రాంతి బరిలోనే వస్తున్నాయి.

పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై విశ్వప్రసాద్ నిర్మిస్తున్న ఈగల్ కి కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహిస్తున్నాడు. రవితేజ సరసన అనుపమా పరమేశ్వరన్, కావ్య థాపర్ లు హీరోయిన్ లుగా చేస్తున్నారు. ఇటీవలే వచ్చిన ఈగల్ టీజర్ తో ఈ సినిమా మీద అంచనాలు పీక్ లో ఉన్నాయి.
![]() |
![]() |