![]() |
![]() |
కొంతమంది హీరోలు తాము చేసే సినిమాల ఎంపిక విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. తమ ప్రతి సినిమాలో ఏదో ఒక కొత్త పాయింట్ ఉండాలని, రెగ్యులర్ క్యారెక్టర్లకు భిన్నంగా ఉండే క్యారెక్టర్లను పోషించాలని భావిస్తుంటారు. అలాంటి వారిలో నారా రోహిత్ కూడా ఒకరు. తను మొదటి నుంచీ విభిన్న చిత్రాలపైనే ఎక్కువ ఫోకస్ పెట్టాడు. ప్రస్తుతం ఒక సందేశాత్మక చిత్రంలో నటిస్తున్నాడు రోహిత్. 2014లో వచ్చిన ‘ప్రతినిధి’ సినిమా అప్పట్లో అందరి ప్రశంసలు అందుకుంది. ఇప్పుడా సినిమాకి సీక్వెల్‌గా ‘ప్రతినిధి2’ రాబోతోంది. ఈ చిత్రం షూటింగ్ ఆగస్ట్ చివరి వారంలో ప్రారంభించారు. నాలుగు నెలలుగా జరుగుతున్న షూటింగ్‌తో దాదాపు పూర్తి కావచ్చింది. మూడు రోజుల టాకీ పార్ట్‌తో పాటు రెండు పాటలు చిత్రీకరించాల్సి ఉంది. దీంతో టోటల్‌గా షూటింగ్ పార్ట్ పూర్తవుతుంది.
5 సంవత్సరాల క్రితం ‘వీర భోగ వసంత రాయలు’ చిత్రంలో చివరి సారిగా కనిపించాడు రోహిత్. కొంత గ్యాప్ తర్వాత ‘ప్రతినిధి2’తో మళ్ళీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ సినిమాలో ప్రముఖ బెంగాలీ నటుడు జిషు సేన్‌గుప్తా కీలక పాత్ర పోషిస్తున్నారు. ప్రముఖ జర్నలిస్ట్, న్యూస్ ప్రెజెంటర్ మూర్తి దేవగుప్తాపు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని కుమారరాజా బత్తుల, ఆంజనేయులు శ్రీతోట, కొండకళ్ల రాజేందర్‌రెడ్డి నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది జనవరిలో రిపబ్లిక్ డే సందర్భంగా ‘ప్రతినిధి 2’ చిత్రాన్ని విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతం సొసైటీలోని కొన్ని అంశాలను స్పృశిస్తూ వాటిని హైలైట్ చేసే విధంగా ఈ సినిమా ఉండబోతోంది. గ్యాప్ తర్వాత మళ్ళీ ప్రేక్షకులను పలకరించేందుకు వస్తున్న నారా రోహిత్‌కి ‘ప్రతినిధి2’ ఎలాంటి సక్సెస్‌ను అందిస్తుందో చూడాలి.
![]() |
![]() |