![]() |
![]() |

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఎన్నో చిత్రాల్లో ఓజి కూడా ఒకటి. డివివి ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై నిర్మిస్తున్న ఆ చిత్రానికి సుజిత్ దర్శకుడు. పవన్ బర్త్ డే సందర్భంగా ఓజి నుంచి వచ్చిన పవన్ లుక్ ని చూసిన వాలందరికి సినిమాలో ఒక కొత్త పవన్ కళ్యాణ్ ని చూస్తున్నామని ఫిక్స్ అయ్యారు. అలాగే ఆ సినిమా త్వరగా షూటింగ్ ని పూర్తి చేసుకొని థియేటర్స్ లోకి త్వరగా రావాలని ఎదురుచూస్తున్న పవన్ అభిమానులని ఇప్పుడు ఒక షాకింగ్ వార్త కలవరపెడుతుంది.
పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఓజి షూటింగ్ ప్రస్తుతం జరగడంలేదని ఆ చిత్ర నిర్మాణ సంస్థ డివివి ఎంటర్ టైనేమెంట్స్ సంస్థ తన ట్విటర్ ద్వారా వెల్లడి చేసింది. అలాగే పవన్ ఫ్యాన్స్ ని ఉద్దేశించి డియర్ పవన్ ఫాన్స్ మీరు ఎప్పుడు కూడా మీ హీరో సినిమా చూడాలనే ఆకలితో ఉంటారు. మీ అందరికి ఇప్పుడు చెప్పేది ఒకటే ప్రస్తుతానికి ఓజి షూటింగ్ జరగడంలేదు. తిరిగి ఎప్పుడు ప్రారంభం అయ్యేది అప్ డేట్ ఇస్తామని డివివి సంస్థ ప్రకటించింది.

ఇప్పుడు డివివి ఎంటర్ టైన్మెంట్స్ చేసిన ఈ వ్యాఖ్యలతో పవన్ ఫ్యాన్స్ డీలాపడిపోయారు. ఒక పక్క రెండు సంవత్సరాల క్రితమే ప్రారంభం అయిన హరి హర వీరమల్లు షూటింగ్ జరగడంలేదు. ఇంకో పక్క ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ ప్రోగ్రెస్ ఎంతవరకొచ్చిందో కూడా ఆ చిత్ర నిర్మాతలు చెప్పటం లేదు. ఇప్పుడు ఓజి షూటింగ్ జరగడంలేదని ఆ చిత్ర నిర్మాణ సంస్థ చెప్పడంతో పవన్ ఫ్యాన్స్ తీవ్ర అసంతృప్తితో ఉన్నారు.
![]() |
![]() |