![]() |
![]() |

నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం కె ఎస్ రవీంద్ర ( బాబీ ) దర్శకత్వంలో సినిమా చేస్తున్న విషయం అందరికి తెలిసిందే. అఖండ, వీరసింహ రెడ్డి, భగవంత్ కేసరి లాంటి హ్యాట్రిక్ సినిమాలతో మంచి జోష్ మీద ఉన్న బాలయ్య చేస్తున్న ఈ సినిమా మీద నందమూరి అభిమానుల్లో ప్రేక్షకుల్లో భారీ అంచనాలే ఉన్నాయి. ఇప్పుడు ఈ సినిమాలో విలన్ గా నటించబోయే ఒక ఆర్టిస్ట్ గురించి ఇండస్ట్రీ వర్గాలు మొత్తం మాట్లాడుకుంటున్నాయి. అలాగే ఆయన తాజాగా బాలయ్య గురించి చెప్పిన మాటలు కూడా రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ అయ్యాయి.
యానిమల్ మూవీలో ఒక్క డైలాగ్ కూడా లేకుండా కేవలం తన కళ్ళతో బాడీ లాంగ్వేజ్ తో ప్రేక్షకుడి ఒళ్ళు గగుర్పుట్టించేలా నటించిన నటుడు బాబీ డియోల్..విలన్ గా యానిమల్ లో ఆయన పండించిన పెర్ ఫార్మెన్సు గురించి ఎంత చెప్పుకున్న తక్కువే అవుతుంది. ఇప్పుడు బాలయ్య సినిమాలో విలన్ గా కూడా చేస్తున్న బాబీడియోల్ తాజాగా బాలకృష్ణ గురించి మాట్లాడుతు బాలా సార్ చాలా మంచి వ్యక్తి .ఇటీవలే సార్ ని సెట్స్ లో కలిశాను. చాలా ఎనర్జీతో ఉంటారు. అసలు అంత ఎనర్జీతో ఉండే వ్యక్తిని నేను చూడలేదు. ఒక రకంగా చెప్పాలంటే అది ఆయనకి గాడ్ గిఫ్ట్ అని కూడా చెప్పవచ్చు. ఆయనతో కలిసి పని చేయడం చాలెంజింగ్ గా అధ్బుతంగా కూడా ఉందని బాబీ డియోల్ చెప్పుకొచ్చాడు .అలాగే ఆయనకీ తెలుగులో విలన్ గా మరిన్ని సినిమాలు చర్చల దశలో ఉన్నాయి.
యానిమల్ సినిమా ద్వారా రణ్బీర్ కపూర్ కి ఎంత పేరు వచ్చిందో బాబీ డియోల్ కి అంతే పేరు వచ్చింది. సినిమా చివరలో వచ్చినా కూడా తన సూపర్ పవర్ యాక్టింగ్ తో యానిమల్ విజయానికి ఆయన కూడా ఒక కారణంగా నిలిచాడు. అలాంటి బాబీడియోల్ బాలయ్య గురించి చెప్పిన మాటలతో బాలయ్య ఫ్యాన్స్ ఫుల్ హుషారుతో ఉన్నారు. అలాగే బాలయ్య సినిమా అంటేనే విలన్ కి బాలయ్య కి మధ్య వచ్చే డైలాగ్స్ గాని యాక్షన్ ఎపిసోడ్స్ గాని ఒక రేంజ్ లో ఉంటాయి. ఆ ఇద్దరి మధ్య వచ్చే సన్నివేశాలు బాలయ్య ఫ్యాన్స్ తో పాటు ప్రేక్షకులకి కూడా ఎంతో కనువిందుని కలగచేయడంతో పాటు ఒక రకమైన అనుభూతిని కూడా ఇస్తాయి. ఇప్పుడు బాబీ డియోల్ బాలయ్య మధ్య వచ్చే సీన్స్ ఏ రేంజ్ లో ఉంటాయో అని అభిమానులు ఇప్పటినుంచే మాట్లాడుకుంటున్నారు.
![]() |
![]() |