![]() |
![]() |

నటి మాధవీలత గురించి చెప్పాలంటే ఈమె ఒక ఫైర్ బ్రాండ్...ఆల్రెడీ చిన్మయి శ్రీపాద, రేణు దేశాయ్, అనసూయ, రష్మీ ఇలా కొంతమంది ఎలాంటి విషయం మీదైనా అనర్గళంగా మాట్లాడగలరు అలాగే పోట్లాడనూ గలరు. మాధవి కూడా ఎం తక్కువ కాదు. ఆమె మాట్లాడని అంశం అంటూ ఏదీ ఉండదు. సెటైర్స్ వేయని టాపిక్స్ కూడా ఉండవు..ఆమె మూవీస్ లో నటించడం ఆపేసాక సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటున్నారు. ఇక ఇప్పుడు కాంగ్రెస్ ఫ్రీ బస్ గురించి కామెంట్స్ చేశారు. తన ఇన్స్టాగ్రామ్ స్టేటస్ లో సుదీర్ఘ మెసేజెస్ పెట్టారు.
"నిజం చెప్పాలంటే ఆడవాళ్లంటే నాకు చిరాకు... ఉచిత బస్సు టికెట్ మీ బతుకు అంతేగా ? మీకు అభివృద్ధి అవసరం లేదు అంతేగా మీరు చేతకాని చెమ్మచెక్కలు అంతేగా ? ఆడవాళ్ళని భూమి మీద ఎవడు బాగు చేయలేడు..మీ బతుకులు ఉచిత బస్సు ప్రయాణం... సీరియల్ కన్నీళ్లు మాత్రమే... 2 సంవత్సరాల తర్వాత తెలంగాణ మహిళలు ఎలా ఉంటారో చూడాలని ఉంది...రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో తెలంగాణా అభివృద్ధి చూడాలనుకుంటున్నాను... ఆయనపై నాకు మంచి అభిప్రాయం ఉంది..నేను కాంగ్రెస్‌ను ద్వేషిస్తున్నాను కానీ మిస్టర్ రేవంత్‌ని కాదు. నేనూ ఫ్రీ బస్ మీద ఓక పోస్ట్ పెట్టినా...మన ఇన్స్టాగ్రామ్ మేధావులు మాత్రం మీకు మహిళా సంక్షేమం అవసరం లేదు అంటున్నారు..ఫ్రీ బస్ కావాలంటే సర్ఫ్ ఎక్సెల్ పాయింట్ లా విలేజ్ కి పో..మహిళల్ని చూడు అని కామెడీ చేస్తున్నారు. పల్లెటూరిలో పెరిగిన నాకే నీతులు చెప్తున్నారు... మా ఊళ్ళో కూలికి పొతే రోజుకు 300-500 మంది మహిళలు బిందాస్ ఉంటారు.. డెవలప్‌మెంట్ అవసరం లేదు... మహిళలకు ఉచిత బస్సు కావాలి అని కొందరు మగ పురుగులు సందేశాలు పెట్టారు. సంతోషం.. ఆటోలు నడుపుకునే వాళ్ళ పెళ్ళాలు బస్ లో వెళ్తారు. ఆటోలు నడువక పిల్లలు రోడ్ మీద పడతారు అంతేగా ? సంతోషం....ఐనా నాకెందుకు అధ్యక్షా..మీ సావు మీరు సావండి" అంటూ నటి మాధవి ఫుల్ ఫైర్ లో తన అభిప్రాయాలను తన ఇన్స్టాగ్రామ్ స్టేటస్ లో పోస్ట్ చేసింది.


![]() |
![]() |