![]() |
![]() |

తమిళనాడులో డిసెంబర్ 12 కి ఉన్న ప్రత్యేకత ఏమిటి అంటే అందరు చెప్పే సమాధానం ఆ రోజు మా తలైవా పుట్టినరోజు అని. డిసెంబర్ 12 రజనీ కాంత్ పుట్టిన రోజు. తమిళనాడు వ్యాప్తంగా ఆ రోజు పండగ వాతావరణం నెలకొని ఉంటుంది.ఇప్పుడు ఆ రోజు రజనీ అభిమానులకి డబుల్ పండగ రాబోతుంది. సూపర్ స్టార్ రజనీ నటిస్తున్న తాజాగా చిత్రాన్ని సంబంధించిన ఒక తియ్యటి వార్తని ఆ చిత్ర యూనిట్ ప్రకటించబోతుంది.
రజనీ ప్రస్తుతం తలైవర్ 170 గా తెరకెక్కుతున్న తన నూతన చిత్రం షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. రేపు డిసెంబర్ 12 న రజనీ బర్త్ డే సందర్భంగా ఆ చిత్రం యొక్క టైటిల్ ని చిత్ర బృందం అనౌన్స్ చేయనుంది. ఇప్పుడు ఈ వార్తలతో రజనీ అభిమానులు ఫుల్ ఖుషీతో ఉన్నారు. అలాగే టైటిల్ ఏ విధంగా ఉండబోతుందో అనే క్యూరియాసిటీ రజనీ అభిమానుల్లో ఏర్పడింది. ఎందుకంటే రజనీ నటించే సినిమా టైటిల్స్ అన్ని కూడా ఎంతో వైబ్రేషన్స్ తో కూడి రజనీ ఇమేజ్ కి తగ్గట్టుగా ఉంటాయి. దళపతి,ముత్తు, బాషా ,అరుణాచలం,నరసింహ ఇలా చెప్పుకుంటు పోతే ఎన్నో సినిమాల టైటిల్స్ ఫుల్ మాస్ లుక్ తో ఉంటాయి. లేటెస్ట్ గా వచ్చిన జైలర్ టైటిల్ కూడా రజనీ ఇమేజ్ కి తగ్గట్టే ఉంది జైలర్ సినిమా విజయంలో కీలక పాత్ర కూడా పోషించింది.

సూర్య తో జై భీం లాంటి విభీమన్నమైన సినిమాని తెరకెక్కించి సూర్య జీవితంలోనే బెస్ట్ మూవీగా నిలిచేలా చేసిన టి జె జ్ఞానవేల్ తలైవర్ 170 కి దర్శకత్వం వహించడంతో ఆ మూవీ మీద రజనీ అభిమానుల్లో భారీగానే అంచనాలు ఉన్నాయి. బూటకపు ఎన్ కౌంటర్లని ప్రశ్నించే పోలీస్ అధికారిగా రజనీ ఆ మూవీలో కనిపించబోతున్నాడని సమాచారం. అనిరుద్ సంగీతాన్ని అందిస్తున్నాడు. బిగ్ బి అమితాబచ్చన్ ఈ చిత్రంలో ఒక కీలక పాత్రని పోషిస్తున్నారు.
![]() |
![]() |