![]() |
![]() |
‘బద్రి’తో టాలీవుడ్‌లో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన రేణు దేశాయ్ ఆ తర్వాత చేసిన సినిమాలు తక్కువే అయినా నటిగా మంచి పేరే తెచ్చుకుంది. 2009లో పవన్‌కళ్యాణ్, రేణు దేశాయ్ ప్రేమించి పెళ్ళి చేసుకున్నారు. 2012లో కొన్ని కారణాల వల్ల విడిపోయారు. రేణు దేశాయ్ చివరగా నటించిన సినిమా ‘జాని’ ఈ సినిమా తర్వాత మళ్ళీ ఇటీవల వచ్చిన ‘టైగర్ నాగేశ్వరరావు’ చిత్రంలో కనిపించింది. ఈ సినిమా ఆశించినంత విజయం సాధించకపోవడంతో ఆమె చేసిన క్యారెక్టర్‌కు కూడా గుర్తింపు రాలేదు. ‘జాని’ తర్వాత పవన్‌కళ్యాణ్ హీరోగా నటించిన సినిమాలకు కాస్ట్యూమ్ డిజైనర్‌గా వర్క్ చేసింది. ‘ఖుషి’లోని ‘యే మేరా జహా’ పాటకు, ‘బాలు’లోని ‘హట్ హట్‌జా..’ పాటకు ఎడిటింగ్ వర్క్ చేసింది. పవన్‌కళ్యాణ్ నుంచి విడిపోయిన తర్వాత 2014లో ‘ఇష్క్ వాలా లవ్’ అనే చిత్రానికి దర్శకత్వం వహించడమే కాకుండా నిర్మించింది. అయితే మొదటి నుంచి రేణు దేశాయ్‌కి డైరెక్షన్, ప్రొడక్షన్‌పై ఎక్కువ ఆసక్తి ఉన్నట్టు పలు సందర్భాల్లో తెలియజేసింది.
తన చిరకాల కోరిక అయిన ప్రొడక్షన్‌కు సంబంధించి ఇప్పుడామెకు ఓ గొప్ప అవకాశం వచ్చింది. టాలీవుడ్‌లో పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సినిమా నిర్మాణ రంగంలో ప్రముఖ సంస్థగా పేరు తెచ్చుకుంది. ఈ సంస్థ పలు చిత్రాలను నిర్మిస్తోంది. ఈ సంస్థతో పవన్‌కళ్యాణ్‌కు కూడా మంచి సంబంధాలు ఉన్నాయి. అంతేకాదు ఆమధ్య పవన్‌కళ్యాణ్ నటించిన ‘బ్రో’ చిత్రాన్ని నిర్మించింది ఈ సంస్థే. ఇప్పుడు రేణుదేశాయ్ ఈ సంస్థలోకి ఎంట్రీ ఇచ్చిందని తెలుస్తోంది. జనసేన పార్టీలో ముఖ్యమైన నేతగా పేరు తెచ్చుకున్న నాదేండ్ల మనోహర్‌కి పీపుల్స్ మీడియా విశ్వప్రసాద్ సన్నిహితులు. ఇప్పుడీ సంస్థలోకి రావడం ద్వారా రేణుదేశాయ్ సినిమా నిర్మాణంపైనే తనకున్న కోరికను నెరవేర్చుకోవడానికి సానుకూలత ఏర్పడిరది. పీపుల్స్ మీడియాలో నిర్మాణమవుతున్న సినిమాల్లో ఏదో ఒకదాన్ని టేకోవర్ చేసుకోవడమో లేక తనే సొంతంగా సినిమాను నిర్మించడమో చేసే అవకాశం ఉంది. రేణు దేశాయ్ కోసం ఈ సంస్థ ఒక ప్రత్యేక కేబిన్‌ని కూడా డిజైన్ చేశారట. ఒక మంచిరోజున ఆమె కేబిన్‌లోకి అడుగు పెట్టిందట. మరి ఈ సంస్థ ద్వారా ఎలాంటి సినిమాలు ఆమె నుంచి వస్తాయో వేచి చూద్దాం.
![]() |
![]() |