![]() |
![]() |

పదేళ్ల వయసులో చిన్నారి పెళ్లికూతురు అనే సీరియల్ తో తెలుగు వారందరి మనసులో స్థానాన్ని సంపాదించిన నటి అవికా గోర్. చిన్నారి ఆనందిగా ఆ సీరియల్ లో అవికా ప్రదర్శించిన నటనకి ఎంతో మంది తనకి అభిమానులుగా మారారు. ఆ తర్వాత అవికా సోలో హీరోయిన్‌గా అన్నపూర్ణ స్టూడియోస్ సంస్థ నిర్మించిన ఉయ్యాల జంపాల అనే సినిమాతో తెలుగు సినిమా రంగంలో అడుగుపెట్టింది. తాజాగా తన లైఫ్ గురించి అవికా చేసిన కొన్ని వ్యాఖ్యలు సంచలనం సృష్టిస్తున్నాయి.
అవికా గోర్ అవకాశం వచ్చినప్పుడల్లా సినిమాల్లో నటిస్తూనే ఇంకో పక్క వెబ్ సిరీస్ ల్లో కూడా చేస్తుంది. తాజాగా వధువు అనే వెబ్ సిరీస్ లో అవికా టైటిల్ రోల్ పోషిస్తుంది. ఈ మేరకు వధువు కి సంబంధించిన ప్రమోషన్స్ లో పాల్గొన్న అవికా మీడియాతో మాట్లాడుతూ స్క్రీన్‌పై నాకు ఇప్పటి వరకు కనీసం 20 సార్లు అయినా పెళ్లి అయ్యి ఉంటుంది.చిన్నారి పెళ్లి తో ప్రారంభమయిన నా సినీ పెళ్లి ప్రస్థానం నేటి వధువు వరకు ఎలాంటి ఆటంకాలు కలగకుండా జరుగుతు వస్తుంది అని అవికా చెప్పింది.
అన్ని సార్లు పెళ్లికూతురు గెటప్ వెయ్యడంవల్ల నాకు ఆ గెటప్ మీద బోర్ కొట్టలేదని ఎందుకంటే పెళ్లి కూతురిలా చీర కట్టుకుని హెయిర్ స్టైల్ చేసుకుని మేకప్ వేసుకోవడం అంటే నాకు చాలా ఇష్టం అని కూడా అవికా చెప్పింది.అలాగే ఇప్పుడు మీ ముందుకు రాబోతున్న వధువులో ఫస్ట్ ఎపిసోడ్‌లోనే నా పెళ్లి జరుగుతుంది. అప్పుడు నాకు ఒక విషయం మాత్రం అనిపించింది. ఇన్ని రోజులు సినిమా కోసం పెళ్లి కూతుర్ని అయ్యాను ఇప్పుడు వెబ్ సిరీస్ కోసం పెళ్లి కూతుర్ని అవుతున్నానని అనిపించేదని అవికా చెప్పింది .
![]() |
![]() |